ఫోకస్

నిధులు, విధుల బదలాయింపు సంగతేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం నగరాలను కేంద్రం ఆకర్షణీయమైన నగరాలుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేయడం స్వాగతిస్తాం. కాని ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు, ప్రపంచంలోని హిందువులకు మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతి సంగతి ఏమిటి? కర్నూలు, తిరుపతిని స్మార్ట్ సిటీల జాబితాలో ఉండేటట్లు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. స్మార్ట్ సిటీల ఎంపికకు కేంద్రం మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మార్గదర్శకాలకు లోబడి కాకినాడ, విశాఖపట్నంను ఎంపిక చేయడం మంచిదే. కాని ఈ మార్గదర్శకాలను చూస్తే కర్నూలు, తిరుపతికి ఈ అవకాశం ఇప్పట్లో లభిస్తుందా అనే అనుమానం వస్తుంది. ఈ ఏడాది నుంచి ఈ పథకం కింద నిధులు లభిస్తాయి. సాలీనా వంద కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఈ స్మార్ట్ సిటీకి ఐదు వందల కోట్లు ఇస్తారు. ఈ నిధులను పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిన అభివృద్ధికి ఖర్చుపెడుతారు. ఆకర్షణీయమైన నగరాలుగా ఎంపికైన మున్సిపాలిటీల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడంలో రవాణా, విద్యుత్తు, హెల్త్, విద్య, డ్రైనేజీ వ్యవస్ధను ఆధునీకరిస్తారు. కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం స్ధానిక సంస్ధలకు నిధులు, విధులు బదలాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిధులు, విధులు మున్సిపాలిటీలుగా బదలాయించిందా? స్ధానిక సంస్ధలపై పెత్తనం కొనసాగించేందుకు ప్రభుత్వాలు ఆసక్తిచూపుతాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాలకు కేంద్రం విడుదల చేసిన నిధులు నిర్దేశించిన లక్ష్యాల అమలుకు ఖర్చు చేస్తారా? ఇప్పటికే కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర రంగాలకు మళ్లించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులను ఇస్తుందా అనే అనుమానం వస్తుంది. కేంద్రం నుంచి మంజూరైన నిధులను సక్రమంగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మున్సిపాలిటీలు, పెద్ద గ్రామ పంచాయితీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేదు. డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్లు, ఇతర వౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది. కేవలం స్మార్ట్ సిటీల పేరిట ఒకటి రెండు నగరాలకే నిధులను కుమ్మరించడం అంత మంచి పద్ధతి కాదు. ఆకర్షణీయమైన నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం మంచిదే. కాని బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకే ఈ స్కీంను పరిమితం చేయడం సరికాదు. వెనకబడిన ప్రాంతాల్లోని నగరాలు, పట్టణాల సంగతేమిటి? ఈ కోణంలో నుంచి కూడా కేంద్రం ఆలోచించాలి.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసన సభాపక్ష ఉపనేత