ఫోకస్

వౌలిక సదుపాయాలు ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగిన తరువాత నవ్యాంధ్రలో ఇప్పుడిప్పుడే పారిశ్రామికాభివృద్ధి పురోగతి సాధిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కే పరిమితమైన పారిశ్రామికాభివృద్ధి, ఇప్పుడు వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు నవ్యాంధ్ర వైపు చూస్తున్నారనే చెప్పాలి. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా విశాఖలో పారిశ్రామిక ప్రగతి జోరందుకుంటోంది. పతంజలి సంస్థ విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళంలో కూడా పరిశ్రమలు స్థాపించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖలో ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్‌ప్లాంట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, కోరమాండల్ తదితర సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా మంచి పరిణామమనే చెప్పాలి. కృష్ణపట్నం ఓడరేవు ద్వారా నెల్లూరు తదితర ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి వేగవంతమైంది. శ్రీసిటీలో జపాన్ కంపెనీలు, అనంతపురంలో కియో మోటార్స్ వంటి సంస్థల రాకతో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, విజయవాడ కేంద్రాలుగా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఊపందుకుంది. ఇక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విస్తృతికి ఓడరేవులు, విమానాశ్రయాలు కూడా ఎంతో దోహదం చేస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పారిశ్రామిక వేత్తలు కోరుకునేది కూడా ఇటువంటి సదుపాయాలనే. పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక హోదా అంశంతో సంబంధం ఉందని అనుకోవట్లేదు. రూ.కోట్ల పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలు కోరుకునేది సౌకర్యవంతమైన వాతావరణానే్న. వౌలిక సదుపాయాలు కల్పించడంతో నీరు, విద్యుత్ సహా అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇవ్వగలిగితే పరిశ్రమల స్థాపనకు ఢోకా ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా నవ్యాంధ్రలో పారిశ్రామికాభివృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. భవిష్యత్‌లో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.
- సాంబశివరావు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు