ఫోకస్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. హైదరాబాద్‌ను ఉదాహరణగా తీసుకుంటే నగరం ఒక్క ఏడాదిలో అభివృద్ధి చెందలేదు. అనేక వందల సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. లోగడ గోల్కండ, నిజాం నవాబులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విధానం నుంచి మొదలుకుని వంతెనలు, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, ఉస్మానియా వర్సిటీ, నగరం నడిబొడ్డున అసెంబ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎనె్నన్నో ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత టిడిపి ప్రభుత్వాలూ అభివృద్ధికి కృషి చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మెట్రో రైలుకు రూపకల్పన చేయడం జరిగింది. కృష్ణా నదీ జలాలు హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు తీసుకుని రావడం జరిగింది. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, అమెరికన్ కౌన్సిలెట్ ఏర్పాటు, అనేకానేక పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా బ్రిటీషు కాలం నుంచే వివిధ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కాటన్ దవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ కాంగ్రెస్ హయాంలో జరిగాయి. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు గంగకు రూపకల్పన చేశారు. ఇలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అంతా మేమే చేశాం అనడం భావ్యం కాదు. అయితే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ చేశారన్న చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక పరిశ్రమల స్థాపన విషయానికి వస్తే మూత పడిన వివిధ పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేయకుండా విదేశీ పర్యటనలతో ప్రచార ఆర్భాటాన్ని చేస్తున్నారు. దావోస్‌లో ఐదు రోజుల పాటు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు వెళ్ళారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూత పడిన పరిశ్రమలను తెరిపించే ప్రయత్నం చేయకుండా, కొత్తగా పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులతో ముందుకు రావాలని ఆహ్వానించడం విస్మయం కలిగించింది. ఉదాహరణకు చిత్తూరులో మూతపడిన మన్నవరం పరిశ్రమ, రైల్వే కోడూరులో ముగ్గురాయి పరిశ్రమల సంగతేమిటీ?, అదేవిధంగా తెలంగాణలో మూతపడిన స్పిన్నింగ్ మిల్లు, చక్కెర పరిశ్రమ సంగతేమిటీ? మూత పడిన పరిశ్రమలను తెరిపిస్తే నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుంది. ఆ తర్వాత విదేశాలకు పెట్టుబడులు ఆకర్షించేందుకు వెళ్ళవచ్చు. కొత్త వాటి కోసం ఆలోచన చేసినా, ముందుగా మూత పడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు చర్యలు చేపట్టాలి. వీటికి కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలి.
- డాక్టర్ ఎన్. తులసీ రెడ్డి మాజీ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి