ఫోకస్

అభివృద్ధిలో పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నువ్వా నేనా చందంగా ఇరు తెలుగు రాష్ట్రాలూ పోటీపడటం మొత్తం దేశానే్న ఆశ్చర్యపరిచింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ ఆర్ధికంగా పటిష్టస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిలో తెలంగాణకు వెనుక నిలిచింది. అయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటి తదితర రంగాల్లో మాత్రం తీవ్రంగా పోటీపడుతున్నాయి. నీతి ఆయోగ్ లెక్కలు ప్రకారం పురోగతిలో సైతం తెలంగాణ ముందంజలో ఉంది. జిల్లాల్లో చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ముందంజలో ఉంది. తెలంగాణలో మొత్తం జిడిపిలో సేవారంగం వాటా 59.01 శాతం, వ్యవసాయ రంగంలో 55.7 శాతం మంది పనిచేస్తుండగా, సేవారంగంలో 32.6 శాతం, పారిశ్రామిక రంగంలో 11 శాతం పనిచేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా నుండి సేవారంగంలో సింహభాగం వాటా లభిస్తోంది. పారిశ్రామిక రంగం నుండి హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి జిల్లా, మెదక్ పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం నుండి, మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు ప్రాంతం నుండి లభిస్తోంది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 36082 రూపాయిలుగా ఉంది. తెలంగాణలో అనేక ఖనిజ నిక్షేపాలున్నాయి. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బొగ్గు గనులు, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ముడి ఇనుము, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముగ్గు రాయి, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాలు వ్యాపించి ఉన్నాయి. రాష్టవ్య్రాప్తంగా ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా తాండూరు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతాల్లో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ కొత్తూరులో పారిశ్రామిక వాడ, హైదరాబాద్‌లో టిహబ్, ఐటి పరిశ్రమలు, వరంగల్ లెదర్ పరిశ్రమ, బోధన్‌లో చక్కెర కర్మాగారాలు, సిర్పూరులో కాగిత పరిశ్రమ, కొత్తగూడెంలో ఎరువుల పరిశ్రమ తెలంగాణ అభివృద్ధికి ఊతంగా నిలిచాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గోదావరి, కృష్ణ జీవనదులు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. వరి, చెరకు, పత్తి, మిరపకాయలు, మామిడి, పొగాకు ప్రధానంగా పండుతున్నాయి. పొద్దుతిరుగుడు , వేరుసెనగల పంట సాగు కూడా బాగా పెరిగింది. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం, జీవ సాంకేతిక రంగంపై దృష్టి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐటి ఎగుమతుల్లో మహారాష్ట్ర, కొత్త ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల తర్వాత ఏడో స్థానంలో ఉంది. ఖనిజ సంపదలో దేశంలో రెండో స్థానంలో ఉంది. దేశంలో సున్నపురాయి నిల్వల్లో మూడో వంతు అంటే సుమారు 30 బిలియన్ టన్నులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. సుమారు 11 శాతం వాటాతో జలవిద్యుత్ రంగంలో ఏపి దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. కృష్ణాగోదావరి పరీవాహకంలో 60 ట్రిలియన్ల ఘనపు అడుగుల సహజ వాయువు నిల్వ భారతదేశపు అవసరాలను మూడోవంతు తీర్చగలవు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల్లో అభివృద్ధిపై నిపుణుల అభిప్రాయాలు ఈ వారం ఫోకస్‌లో ...