ఫోకస్

నగరాల స్వరూపమే మారిపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్టు సిటీల పథకం సవ్యంగా అమలుజరిగితే నగరాల స్వరూపమే మారిపోతుంది. ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సహకారంతో, ప్రజల ప్రమేయంతో నడిచే పథకం. ప్రజలు ముందుకు వచ్చి తమ నగరాలు అందమైనవిగా, కాలుష్యరహితమైనవిగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగేవిగా ఉండాలని కోరుకోవాలి, అందుకు ప్రజలు అంతా తోడ్పడాలి.
కేంద్రప్రభుత్వం స్మార్టు సిటీల ఎంపికపై ఈసారి ఒక పద్ధతిని పాటించింది. రాష్ట్రాలనే తమ నివేదికలను ఇవ్వమని కోరింది. రాష్ట్రాలు ఇచ్చిన ప్రతిపాదనలపై పాయింట్లు జోడించి ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక ప్రక్రియలో కేంద్రప్రభుత్వం కేవలం ఫెసిలిటెటర్ పాత్రను మాత్రమే పోషించింది. తొలి జాబితాలో 20 నగరాలను ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన నగరాల్లో భువనేశ్వర్, పూణే, రాజస్థాన్ జైపూర్, సూరత్, కోచి, జబల్‌పూర్, న్యూఢిల్లీ, విశాఖపట్టణం, కాకినాడ, షోలాపూర్, కోయంబత్తూరు, బెళగావి, దావణగరె, అహ్మదాబాద్, గౌహతి, చెన్నై, లూథియానా, భోపాల్, ఉదయ్‌పూర్, ఇండోర్ ఉన్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలను అంతర్జాతీయ నగరాల ప్రమాణాల స్థాయికి తీసుకువెళ్లడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యంతో నగరాల అభివృద్ధి చేయడం వల్ల సమర్ధవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ, వ్యర్ధ నీటి రీసైక్లింగ్, నీటి వృధా అరికట్టే సెన్సార్ల ఏర్పాటు, గ్రీన్ స్పేసెస్, భౌతిక సాంఘిక సౌకర్యాల కల్పన, ప్రత్యేక ఆర్ధిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి, వస్తుసేవల లభ్యత, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, సహజ వనరుల సమర్ధ వినియోగం, పర్యావరణ పరిరక్షణ యాజమాన్యం, స్మార్టు పట్టణాభివృద్ధి సాధన, సుస్థిర వృద్ధి, గ్లోబల్ నెట్ వర్కింగ్, సృజనాత్మక పరిశ్రమ, ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి తేవడం, ఈ అర్బన్ గవర్నెన్స్, పారిశ్రామికీకరణ, భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ అందుబాటులో ఉంటాయి. నగరాలు మిగిలిన దేశాల్లోని ప్రముఖ నగరాల సరసన నిలుస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత జీవనానుకూల నగరాలుగా మారుతాయి. ఇందులో రాష్ట్రప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ వంతు ఖర్చును భరిస్తాయి. చివరికి నగరాలను శుభ్రంగా ఉంచుకోవల్సింది, అందుకు సహకరించాల్సింది, బాధ్యత వహించాల్సింది కూడా స్థానిక ప్రజలే.

-ఎం. వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి