ఫోకస్

వౌలిక సదుపాయాలు కల్పిస్తే అన్నీ స్మార్ట్ సిటీలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణకు స్మార్ట్‌సిటీలు రాలేదనే భావన ఉండకూడదు. ప్రస్తుత ప్రభుత్వం స్మార్ట్‌సిటీలో ఉండే వౌలిక సదుపాయాలు కల్పిస్తే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలు స్మార్ట్ సిటీలుగా మారుతాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో స్మార్ట్‌సిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు స్మార్ట్ సిటీలను ప్రకటించలేదని అపోహ పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్మార్ట్ తెలంగాణగా మార్చుకోవచ్చు.
కనీస సౌకర్యాలు సమకూర్చుకుంటే అన్ని ప్రాంతాలు స్మార్ట్‌సిటీగానే అభివృద్ధి చెందుతాయి. యాగాలు నిర్వహించుకుంటే వారి వారి ప్రయోజనాలకే మంచిది కాని రాష్ట్ర ప్రజలకు కాదని, ఎవరు పూజలు నిర్వహించుకుంటే వారికే మంచిది, కానీ వారు పూజలు నిర్వహించుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందనుకోవడం వారి భ్రమ మాత్రమే. మిగతా రాష్ట్రాలలో ఉన్నట్టు స్మార్ట్ సిటీ తెలంగాణలో లేవని భావించుకోకూడదు. నిరంతర విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, రవాణా సౌకర్యం వంటి సౌకర్యాలు కల్పిస్తే స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీలను రెవెన్యూ కోసం వాడుకుంటాయి. కేంద్రం నిధులతో అభివృద్ధి జరుగుతున్నందున తెలంగాణకు స్మార్ట్‌సిటీ అవసరం లేదు. రాష్ట్రంలోని తెలంగాణ ప్రభత్వం స్మార్ట్‌సిటీల తరహాలోనే అభివృద్ధి పథకాలను ప్రకటిస్తుంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు సక్రమంగా అమలు జరిపితే తెలంగాణ స్మార్ట్‌సిటీ కాదు.. స్మార్ట్ తెలంగాణగా మారుతుంది. విశ్వనగరం వైపు ముందుకెళ్తున్న హైదరాబాద్ స్మార్ట్‌సిటీ కానవసరం లేదు. పాలకులు అభివృద్ధి వైపు దృష్టిసారిస్తే సరిపోతుంది.

-పాండు రంగారావు, లోక్‌సత్తా నాయకుడు