ఫోకస్

నగరాలు ‘స్మార్ట్’గా మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం రూపు మారుతోంది. సకల సదుపాయాలతో గ్రామాలు కలకలలాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే మరో పక్క నగరాల్లో ప్రజలు సంతోషంగా ఆరోగ్యవంతంగా, విజ్ఞానదాయకంగా జీవించేందుకు అవసరమైన వౌలిక వసతుల కల్పనకు నడుంబిగించింది. అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టిన కేంద్రం, తాజాగా దేశంలో వంద నగరాలను స్మార్టుసిటీలుగా అభివృద్ధి చేయదలచింది. ఈ హోదా కోసం 97 నగరాలు పోటీ పడగా, తొలి జాబితాలో కేంద్రం 20 నగరాలను స్మార్టు సిటీలుగా ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన జాబితాలో భువనేశ్వర్, పూణే, రాజస్థాన్ జైపూర్, సూరత్, కోచి, జబల్‌పూర్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ , విశాఖపట్టణం, కాకినాడ, షోలాపూర్, కోయంబత్తూరు, బెళగావి, దావణగరె, అహ్మదాబాద్, గౌహతి, చెన్నై, లూథియానా, భోపాల్, ఉదయ్‌పూర్, ఇండోర్ నగరాలున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకువెళ్లడమే దీని ప్రధాన లక్ష్యం. స్మార్టు ప్రాజెక్టు అంటే రేపటి బాగు కోసం ఆధునిక టెక్నాలజీని అన్ని విషయాల్లో నేటి తరానికి అందించడం. స్మార్టు సిటీల్లో ఈ గ్రివెన్సీ అమలుచేస్తారు. అంటే ఎలాంటి టాక్స్‌లు కట్టాలన్నా, చెల్లింపులు చేయాలన్నా, అడుగు తీసి ఎక్కడికి వెళ్లనక్కర్లేదు, కేవలం ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వైర్‌లెస్ టెక్నాలజీని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం 4జీ టెక్నాలజీని ఎంజాయ్ చేస్తున్నాం, త్వరలో 5జీకి కూడా రానుంది. రానున్న రోజుల్లో ఎక్కడా కేబుల్ వాడకం ఉండబోదు.
అంతా వైర్‌లెస్‌ద్వారానే జరుగుతుంది. సాటిలైట్ కనెక్టివిటీతో హైస్పీడ్ బ్యాండ్ విడ్త్‌తో పనులు జరుగుతాయి. సిటీ యాప్స్ అందుబాటులోకి వస్తాయి. అంటే స్మార్టు సిటీలో వెతుకులాట అంటూ ఉండదు, ప్రతి క్యాటగిరికి ఒక యాప్ అందుబాటులో ఉంటుంది. ప్రతి పాయింట్‌కూ ఎలా చేరుకోవాలో వివరించే మ్యాప్‌లు ఉంటాయి. రూట్ మ్యాప్‌లు ఉంటాయి, దగ్గరి దారులు సూచించే యాప్స్ ఉంటాయి. నగరం మొత్తం మీద ఏది ఎక్కడ దొరుకుతుందో ఇట్టే చెప్పడమేగాక, ప్రజలను మార్గదర్శనం చేస్తాయి. హెల్ప్‌లైన్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నీ సింపుల్‌గా, సింగిల్ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు, రోడ్డు ప్రమాదాలు, పోలీసు, మున్సిపల్ పాలక మండలి ఇలా అన్ని విషయాలకు సంబంధించి ఈ నెంబర్ ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఏ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందో ప్రతి క్షణం రియల్ టైమ్‌లో సమాచారం రావడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి అనుకున్న సమయానికే కోరుకున్న చోటుకు చేరుకునే వీలు కలుగుతుంది. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆటోమేటిక్‌గానే ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే వ్యవస్థ స్మార్టు సిటీస్‌లో అందుబాటులోకి వస్తుంది. ఎప్పటికపుడు క్రైమ్ మానీటరింగ్ ఉంటుంది. షెల్టర్ హోమ్స్ కూడా నిర్మిస్తారు.
అంటే సిటీకి రోజూ ఎంతో మంది వచ్చి పోతుంటారు. అందరికీ సొంత ఇల్లు ఉండాలనేమీ లేదు, అందుకే నగరానికి వచ్చి పోయే వారికి స్మార్టు సిటీస్‌లో ప్రభుత్వ ఆధీనంలోని షెల్టర్ హోమ్స్ నిర్మిస్తారు. ఇల్లు లేని వారికి కూడా అక్కడ పునరావాసం దొరుకుతుంది. ఎకో ఫ్రెండ్లీ, ఆన్‌లైన్ లైబ్రరీలు కూడా అందుబాటులోకి వస్తాయి. పౌరులు నేరుగా పురపాలక విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే పురజనుల మంచిచెడ్డలు, క్షేమసమాచారం, కుశలత దృష్టిలో ఉంచుకుని డబ్బు, వనరులు, పొదుపుచేస్తూ పాలన చేయడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో నగరాల అభివృద్ధి చేయడం వల్ల సమర్ధవంతమైన పబ్లిక్ రవాణా వ్యవస్థ, వ్యర్ధ నీటి రీసైక్లింగ్, నీటి వృధా అరికట్టే సెన్సార్ల ఏర్పాటు, గ్రీన్ స్పేసెస్, భౌతిక సాంఘిక అవస్థాపనా సౌకర్యాల కల్పన, ప్రత్యేక ఆర్ధిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి, వస్తుసేవల లభ్యత, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగుదల, సహజ వనరుల సమర్ధ వినియోగం, పర్యావరణ పరిరక్షణ యాజమాన్యం, స్మార్టు పట్టణాభివృద్ధి సాధన, సుస్థిర వృద్ధి, గ్లోబల్ నెట్ వర్కింగ్, సృజనాత్మక పరిశ్రమ, ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి తేవడం, ఈ అర్బన్ గవర్నెన్స్, పారిశ్రామికీకరణ, భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్మార్టు సిటీస్ పథకం ద్వారా అభివృద్ధి చేసేందుకు నగరాల ఎంపికకు పేర్లను నామినేట్ చేయమని రాష్ట్రాలను కోరింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి మూడు , తెలంగాణ నుండి రెండు నగరాలను నామినేట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు నగరాల పేర్లను నామినేట్ చేస్తే కేంద్రం ఆమోదించింది మాత్రం కేవలం రెండు నగరాలనే, రెండో జాబితాలో మిగిలిన నగరాలకు కూడా అనుమతి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో స్మార్టు సిటీస్‌గా ఎంపిక, కేంద్రం ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలు ఈ వారం ఫోకస్.. ప్రముఖుల అభిప్రాయాలతో ...