రుచి

ఆరోగ్య ప్రదాయిని ‘బార్లీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్లీ పేరు వినగానే అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రమే అది ఉపయోగపడుతుంది అనే దురభిప్రాయం ఉంది. ఇది ఎంతమాత్రమూ సరికాదు. బార్లీ అనారోగ్యంతో బాధపడేవారికి ఎంత ఉపయోగపడుతుందో, ఆరోగ్యంగా ఉన్నవారు అనారోగ్యంకు గురికాకుండా చూడడం కూడా చేస్తుంది. అయితే, నాగరికత ముసుగులో మనం ఎన్నో పోషక విలువలు ఉన్న బార్లీని నిర్లక్ష్యం చేసి, జంక్‌ఫుడ్స్‌పట్ల ఆకర్షితులమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రాచీన కాలం నుంచి మన ఆహారంలో బార్లీ కూడా ఉండేది.
వృక్ష శాస్త్రం ప్రకారం బార్లీ ‘బరమియా’ కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్ర్తియ నామం హార్డియమ్ వలేర్గేర్. సంస్కృతంలో యవలు అని, హిందీలో జావో అని బార్లీని పిలుస్తారు. బార్లీ గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషిం, నియాసిన్, విటమిన్ బి1, విటమిన్ బి2లు ఉంటాయి. ప్రతి వందగ్రాముల బార్లీ తీసుకోవడం ద్వారా 334 కేలరీల శక్తికూడా వస్తుంది. బార్లీలో వున్న పీచు పదార్థం (ఫైబర్) పేగులను ఎప్పటికప్పుడు శుద్ధిచేస్తుంది. దీనివలన పేగులలో వచ్చే కోలన్ క్యాన్సర్, పేగుపూత, మొలలు, ఎసిడిటీ, గ్యాస్‌ట్రబుల్ తదితరాలను అదుపులో ఉంచుతుంది. బార్లీలోని నియాసిన్ కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం ద్వారా గుండె, నరాల జబ్బులను చక్కగా నియంత్రిస్తుంది. రక్తనాళాలలో క్లాట్స్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. బార్లీ గింజలు కంఠస్వరాన్ని శుద్ధి చేస్తాయి. బాలింతలలో పాలు ఉండేలా చూస్తాయి. అయితే అతి మూత్ర వ్యాధితో ఇబ్బందిపడేవాడు బార్లీ గింజలను వాడకూడదు. వంటికి నీరుచేరిన గర్భిణీలు బార్లీ నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. పిల్లలకు ఇచ్చే పళ్ల రసాలు, సూపులు, పాలులో బార్లీ పౌడర్‌ను కలిపి ఇవ్వడం ద్వారా వారి ఎదుగుదలకు, ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా బార్లీని ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎముకలు పుష్టిగా ఎదగడంతోపాటు కండరాల కదలికలు మెరుగవుతాయి. జ్ఞాపశక్తిని కూడా పెంపొందిస్తుంది. బార్లీ గింజల పిండితో రొట్టెలు లేదా జావను ఆహారంగా తీసుకుంటే స్థూలకాయం కూడా తగ్గుతుంది.
బార్లీ గింజలు తీపి, కొంచెం వగరుగా ఉంటాయి. ఇవి మృదువుగా వుండి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే వీటిని పచ్చిగా తినకూడదు. ఆరోగ్య ప్రదాయిని అయిన బార్లీని తరచూ ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

-పి.మస్తాన్‌రావు