క్రీడాభూమి

ఫుట్‌బాల్ మరింత పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015
============
ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టు ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత అట్టడుగు స్థాయికి పడిపోయింది. అయితే ఇండియన్ సూపర్ లీగ్ పేరిట జరిగిన హడావుడిలో జనం ఈ విషయాన్ని మరిచిపోయారు. వందకోట్లకు పైగా జనాభా కలిగిన దేశంగా ఫుట్‌బాల్‌లో అగ్రస్థానం మాట అటుంచి తనకంటూ కనీస గుర్తింపునైనా దక్కించుకోవాలని భారత్ ఎంతగా ఉవ్విళ్లూరినప్పటికీ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ కోచ్‌గా ఉన్న జాతీయ ఫుట్‌బాల్ జట్టు మాత్రం రోజురోజుకు మరింత దిగజారిపోతోంది. 2018 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఆరు మ్యాచ్‌లకు గాను ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత జట్టు కేవలం మూడు పాయింట్లు మాత్రమే దక్కించుకంది. చిన్నపాటి పసిఫిక్ దీవి దేశమైన గ్వామ్ చేతిలోను మన ఫుట్‌బాల్ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని గమనిస్తే మన జాతీయ జట్టు స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు మన దేశం ప్రపంచ ఫుట్‌బాల్‌లో అట్టడుగున 166వ స్థానంలో నిలిచింది.