క్రీడాభూమి

శాఫ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 31: భారత జట్టు శాఫ్ కప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఈ జట్టు మాల్దీవ్స్‌ను 3-2 తేడాతో ఓడించింది. జేజె లాల్పెక్లువా అత్యంత కీలకమైన రెండు గోల్స్ చేసి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్ 25వ నిమిషంలో కెప్టెన్ సునీల్ చత్రీ ద్వారా భారత్‌కు తొలి గోల్ లభించింది. 34వ నిమిషంలో జేజె చేసిన గోల్‌తో భారత్ 2-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఈ దశలో ఎదురుదాడికి దిగిన మాల్దీవ్స్ ఆటగాళ్లు గోల్స్ కోసం సర్వశక్తులు ఒడ్డారు. 47 నిమిషంలో అందాన్ అలీ ప్రయత్నం ఫలించగా, మాల్దీవ్స్‌కు తొలి గోల్ లభించింది. ఆతర్వాత భారత్ తిరుగులేని రక్షణ విధానాన్ని అనుసరించడంతో మాల్దీవ్స్ దాడులకు ఉపక్రమించడం కష్టమైంది. ఒకవైపు డిఫెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు అవకాశం దొరికిన ప్రతిసారీ దాడులు చేసిన భారత్‌కు 66వ నిమిషంలో జేజె గోల్ అందించాడు. దీనితో భారత్ ఆధిక్యం 3-1కు పెరిగింది. అనుక్షణం గోల్స్‌పైనే దృష్టిపెట్టిన మాల్దీవ్స్ 75వ నిమిషంలో నషీద్ అహ్మద్ ద్వారా ఒక గోల్‌ను సంపాదించి, భారత్ ఆథిక్యాన్ని తగ్గించగలిగింది. కానీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. (చిత్రం) రెండు గోల్స్ చేసిన జేజె