జాతీయ వార్తలు

బ్యాంకులకు వరుసగా నాలుగు రోజుల సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చేవారం 24 నుంచి 27 వరకూ కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ, మార్చి 14: దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులను వచ్చేవారం వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. మార్చి 24 నుంచి 27 వరకూ ప్రభుత్వ సెలవులు కావడంతో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మార్చి 24న హోలీ, 25న గుడ్ ఫ్రైడే, 26న ఆఖరి శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. నెలలో రెండు, ఆఖరి శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాలుగు రోజులూ బ్యాంకులు మూతబడి ఉండడం వల్ల వ్యాపార లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు ఖాతాదారులంతా ఏటిఎంలపైనే ఆధారపడాల్సి వస్తుంది. దీన్నివల్ల ఏటిఎంలలో నగదు అయిపోయే పరిస్థితులు తప్పకపోచ్చు. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు బ్యాంకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవల్సి ఉంది. ఏటిఎంలలో నగదు నింపే కార్యక్రమం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏదిఏమైనా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు కావడం వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తప్పకపోచ్చు.