రాష్ట్రీయం

బెంగళూరు శివార్లలో నలుగురు వైసిపి కార్యకర్తల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 17: రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి చెందిన నలుగురు వైసిపి కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో బెంగుళూరు శివార్లలో గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. ప్రత్యర్థులు విషప్రయోగం చేయడం వల్లే తమవారు మృతిచెంది ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా, ఫుడ్‌పాయిజినింగ్ వల్ల మృతిచెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలం భద్రంపల్లిలో డీలర్‌షిప్ విషయమై టిడిపి, వైసిపిలకు చెందిన కార్యకర్తలకు నడుమ పదిరోజుల క్రితం ఘర్షణ జరిగింది. టిడిపికి చెందిన రామసుబ్బారెడ్డి, నరసింహారెడ్డిలు తమపై వైసిపికి చెందిన ఎనిమిదిమంది దాడిచేసి గాయపర్చారని ఫిర్యాదుచేశారు. వైసిపికి చెందిన వారు కూడా టిడిపి వారిపై కేసుపెట్టారు. కాగా, వైసిపికి చెందినవారు 2007లో జరిగిన జంటహత్యల కేసులో నిందితులుగా ఉన్నారు. ఇటీవలే ఆ కేసును కోర్టులో కొట్టివేశారు. కాగా, డీలర్‌షిప్ వ్యవహారంలో 307 కేసు నమోదు కావడంతో వైసిపికి చెందిన వారు ఎనిమిదిమంది పరారీలో ఉన్నారు. వీరు బెంగుళూరు సమీపంలోని మాలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కోళ్లఫారంలో తలదాచుకున్నారు. మొత్తం ఎనిమిది మంది అక్కడ ఉన్న రెండు రూముల్లో బసచేయగా, ఒకరూములో ఉన్న నలుగురు మృతిచెందడం అనుమానాలకు తావిస్తోంది. లింగాల మండలం అంకివారిపల్లెకు చెందిన చంద్రారెడ్డి (44), భద్రంపల్లి సర్పంచ్ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరుణ్‌కాంత్‌రెడ్డి (33), చెన్నకేశవరెడ్డి (60), రామ్మోహన్‌రెడ్డి (43) ఉన్నారు. వీరు నలుగురు బుధవారం రాత్రి బయటకు వెళ్లి మద్యం సేవించి వచ్చి ఒకరూమ్‌లో పడుకున్నట్లు సమాచారం. తెల్లవారేసరికి శవాలుగా మారడంతో రెండోరూమ్‌లో ఉన్న వారి సహచరులు భోరుమంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు.