అంతర్జాతీయం

ఫ్రాన్స్‌లో ట్రక్కు దూసుకెళ్లి 80 మంది మృతి: 42 మంది పరిస్థితి విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్‌: బాస్టిల్‌ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో గురువారం రాత్రి నీస్‌ నగరంలో ఓ ట్రక్కు ప్రజల పైకి దూసుకెళ్లిన ఘటనలో 80 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. బాస్టిల్‌ డేలో భాగంగా బాణాసంచాను వీక్షిస్తున్న సమయంలోనే ట్రక్కు అధిక వేగంగా పాదచారుల వంతెనపై నుంచి దూసుకెళ్లింది. మృతదేహాలు చెల్లాచెదరుగా పడి భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉండటంతో వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక దళాలు నీస్‌ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఉగ్రదాడిగా...
ప్రజల ప్రాణాలు తీసిన ట్రక్కు డ్రైవర్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.ట్రక్‌ వెనుకభాగంలో తుపాకులు, పేలుడు పదార్థాలను కనుగొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఈ ఘటనను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
హలాండ్‌ దిగ్భాంత్రి ...
దేశ భద్రతను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి తేల్చి చెప్పిందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హలాండ్‌ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. నీస్‌లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబమా తీవ్రంగా ఖండించారు.