హైదరాబాద్

రూ.2 కోట్ల మోసం కేసులో ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: కెనడాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఒకరిని రూ.2 కోట్ల మొత్తానికి మోసం చేసిన కేసులో నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు నగర డెటెక్టివ్ విభాగం జాయింట్ సిపి తెలిపారు. తిరుపతికి చెందిన మూడవ నిందితుడు మబ్బు చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన కె.జనార్థన్ చౌదరి యుఎస్‌ఏలో స్థిరపడ్డారు. అక్కడి పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారు. జనార్థన్ చౌదరికి బంధువులైన కె.ప్రసూన, ఆమె భర్త జి.్భస్కర్‌లు శ్రీనాథ్ అనే ఒకరిని పరిచయం చేశారు. అతను మనీ మంత్రా ప్రాపర్టీస్ అండ్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎండిగా ఉన్నారని పరిచయం సందర్భంగా చెప్పారు. ఆ కంపెనీలో డిపాజిట్లు గానీ, పెట్టుబడులు గానీ పెట్టమని కోరారు. ఈ క్రమంలో తిరుపతిలో ఉన్న తన ఆస్తిని విక్రయించుకుని స్పైనల్ కార్డు ఆపరేషన్ చేయించుకోవాలని చౌదరి అనుకున్నారు. దీంతో శ్రీనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మబ్బు చంద్రశేఖర్ రెడ్డిని పరిచయం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి ఆ ఆస్తిని 3.2 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. దీనిలో భాగంగా రూ.1.2 కోట్లు జనార్థన్ చౌదరికి ముందు చెల్లించి మిగిలిన మొత్తాన్ని అతని కుమారులు ఇద్దరి పేరున మనీ మంత్ర ప్రాపర్టీస్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్ అక్కౌంట్‌లో భవిష్యత్ భద్రత కోసం డిపాజిట్ చేస్తామని చెప్పారు. శ్రీకాంత్, చంద్రశేఖరరెడ్డిలు ఆ సొమ్మును బ్యాంక్‌లో డిపాజిట్ చేశామని చెప్పి, అందుకు సంబంధించిన రెండు బ్యాంక్ రసీదులను స్కాన్ చేసి వాటిని నమ్మకంగా చౌదరికి ఈమెయిల్ ద్వారా పంపించారు. అయితే చెల్లించాల్సిన రెండు కోట్లను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో నిందితులు ఖైరతాబాద్ ఐసిఐసిఐ బ్యాంక్, చిక్కడపల్లి ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌లో డిపాజిట్లు చేసినట్లుగా అక్కడ ఉన్న డిపాజిట్ పత్రాల కౌంటర్ ఫాయిల్స్‌పై బ్యాంక్ ముద్రలు వేసి, వాటిని స్కాన్ చేసి ఈమెయిల్ ద్వారా బాధితుడి పంపించారు. అనంతరం తిరుపతిలో అమ్మకానికి పెట్టిన భూమికి చౌదరి సోదరి వి.హేమలత జిపిఏ కలిగి ఉండడంతో ఆ రూ.2 కోట్ల డిపాజిట్ వివరాలను చెప్పారు. దీంతో 2011 ఏప్రిల్ 18న ఆ ఆస్తి తిరుపతి రూరల్ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో రిజిష్టర్ అయినట్లు తేలింది. దీంతో సొమ్ములు చెల్లించకుండా ఆ భూమిని కాజేయాలనే కుట్ర బయటపడింది. కేసు నమోదు చేసిన డిటెక్టివ్ విభాగం పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.