నల్గొండ

ఉన్నత ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచిత విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించిన ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్
నల్లగొండ , డిసెంబర్ 22: ఉన్నత ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వం లక్ష్యమని ఇంటర్ బోర్డు కమిషనర్ డాక్టర్ అశోక్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘ్భవనంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వచ్చిన ఫలితాలను 201516 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను, ఏవిధంగా అడ్మిషన్‌లను పెంచుకునే అవకాశాలపై పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యకు మంచి స్పందన ఉందని ముఖ్యంగా ప్రభుత్వ బాలికల, బాలుర, వృత్తి విద్యా కళాశాలలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు కలిగి ఉండటం ఆనంద దాయకం అని ఆయా కళాశాలల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ మలుపు లాంటిదని రాబోవు తరాలకు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా అందించాల్సిన భాద్యతను కలిగి ఉండాలన్నారు. మంచి నడవడికతో సమాజానికి వారిని దిశానిర్ధేశకులుగా అందించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యార్థుల తల రాతను మార్చే ఉన్నత శిఖరాలవైపు వారిని నడిపించాలన్నారు. సిలబస్‌ను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని జనవరి నుంచి రివిజన్ చేస్తే 100% ఫలితాలు సాధించగలమని సూచించారు. విద్యార్ధులు ప్రభుత్వ విద్యాలయాల వైపు ఆకర్షితులౌతున్నారని, వారి తల్లిదండ్రులకు సైతం ఆ నమ్మకాన్ని కల్పించేందుకు కృషి చేయాలని, ఉచితంగా చదువుకునే చక్కటి అవకాశం కల్పించాలన్నారు. ప్రతి అంశాన్ని రాయించి, చదివిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. అంతకు ముందు కమిషనర్‌ను ప్రభుత్వ జూనియర్ లెక్షరర్ల సంఘం, ప్రిన్సిపాల్స్ సంఘం, కాంట్రాక్ట్ లెక్షరర్ల సంఘం ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. మెదటగా ప్రభుత్వ బాలికల కళాశాలను, తదుపరి కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి మోమొరియల్ ప్రభుత్వ బాలుర, వృత్తి విద్యా కళాశాలలను సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు పలు సూచనలు చేశారు. కళాశాలలో వున్న వసతులను పరిశీలించారు.
ఈ సమావేశంలో ఆర్‌జెడి మల్హర్‌రావు, డిఐవో ఆండ్రూస్, ఆర్‌ఐఓ ప్రకాశ్ బాబు, ప్రిన్సిపాల్స్ యం.నర్సిరెడ్డి, డి అంజయ్య, జి.అశోక్‌రెడ్డి, టి.లక్ష్మీనారాయణ, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పోలింగ్.. ఓట్ల లెక్కింపు
పారదర్శకంగా నిర్వహించాలి
నల్లగొండ, డిసెంబర్ 22: శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమస్యలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు ఆర్.కె.శ్రీ వాత్సవ కోరారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, 30న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ శిక్షణా కార్యక్రమాలను అవగాహన చేసుకుని పొరపాట్లు లేకుండా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలని సూచించారు. నోటా విధానంతో పాటు చెల్లని ఓట్లపై లెక్కింపు సిబ్బంది అవగాహన కల్గివుండాలన్నారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు డ్వామా కార్యాలయంలో ఐదు టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను, కౌంటింగ్ సూపరవైజర్లుగాను, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారులను కౌంటింగ్ అధికారులుగా నియమించామన్నారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో కౌంటింగ్ సూపర్‌వైజర్లను, సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన పిదప మరో విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపికైన వారికి కౌంటింగ్ విధులు కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. ఓట్లు తక్కువైనప్పటికీ అప్రమత్తతో లెక్కింపు పక్కాగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ రిటైర్డు సెక్రటరీ, రిసోర్స్ పర్సన్ రామబ్రహ్మం లెక్కింపు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. చెల్లని ఓట్లు, చెల్లుబాటు ఓట్లపై లెక్కింపు సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కల్గివుండాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా కోటా ప ద్ధతిలో కౌంటింగ్ నిర్వహించాలని, ఒకటవ ప్రాధాన్యత క్రమం తప్పనిసరిగా వేసిన ఓటు మాత్రమే చెల్లుబాటు కాగలదని వివరించారు. అంటే ఒకటవ నెంబర్ ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండో నెంబర్ వేసినా సదరు ఓటు చెల్లదన్నారు. ఒకటి నెంబర్‌ను రోమన్ అంకెలో కూడా వేయవచ్చన్నారు. బ్యాలెట్ పేపర్‌తో ఓటు క్రమం నెంబర్ కాకుండా ఇతర ఎలాంటి సంతకాలు, రాతలు రాసినా సదరు ఓటు చెల్లదన్నారు. ఈ సందర్భంగా డమ్మి బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్ జరిపించి, కౌంటింగ్ నిర్వహించి సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు జెసి ఎ.వెంకట్రావు, డిఆర్‌వో రవినాయక్, స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డిఆర్‌డిఏ పిడి అంజయ్య పాల్గొన్నారు.

షీ టీమ్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి
అదనపు డిఎస్పీ సునితామోహన్
మునుగోడు, డిసెంబర్ 22: మహిళల భద్రత, రక్షణకై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షీ టీమ్స్‌ను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు డిఎస్పీ సునితామోహన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు ఈవ్ టీజింగ్‌పై పోలిస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిదిగా హజరై ఆమె మాట్లాడారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. స్ర్తిలు అధికంగా ఉండే హాస్టల్, బస్‌స్టాప్, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సిసి కెమరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచామని తెలిపారు. మహిళలు ఎక్కడ వేధింపులకు గురైనా వెంటనే 100డయిల్ చేసి షీ టిమ్స్ సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. విద్యార్థులు, విద్యార్థినీలు చెడు మార్గాన్ని ఎంచుకోకుండా బాగా చదవి ఉన్నత శిఖరాలను అధిరోహించినపుడే సమాజంలో తల్లిదండ్రులకు గౌరవం దక్కుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూర్ సిఐ సుబ్బిరామిరెడ్డి, ఎఎస్‌ఐ అశోక్‌రెడ్డి, కస్తూరిబా పాఠశాల ప్రత్యేకాధికారి సంధ్యారాణి, సిదార్ధ కళాశాల లెక్చరర్ లూసి, రామకృష్ణ కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి స్వామి, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటనారాయణ, కానిస్టేబుల్స్ మురళి, సత్యనారాయణ, విజయ్, లింగస్వామి, రేవతి, జ్యోతి, వివిధ పాఠశాల విద్యార్థులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.

తీ

కస్తూర్బా పాఠశాల సందర్శన
మునుగోడు, డిసెంబర్ 22: మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను జిల్లా అదనపు డిఎస్పీ సునితామోహన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు అండగా పోలిస్ సిబ్బంది ఉంటారని ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు. ఆమె వెంట చండూర్ సిఐ సుబ్బిరామిరెడ్డి, పాఠశాల ప్రత్యేకాధికారి సంద్యారాణి, ఉపాధ్యాయునీలు రేణుక, వసంత, ధనమ్మ, వెంకటరమణ, కానిస్టేబుల్స్ రేవతి, జ్యోతి పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు శ్రీవాత్సవ
భువనగిరి, డిసెంబర్ 22: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. మంగళవారం భువనగిరి ఎంపిడివొ కార్యలయంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ పోలింగ్‌కేంద్రంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా శ్రీవాత్సవ మాట్లాడుతూ పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. బోగస్ ఓట్లను నివారించేందుకు అర్హులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల గుర్తింపు కార్డులను జారీ చేయడం జరిగిందని తెలిపారు. గుర్తింపు కార్డులేకుండా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం జరుగదన్నారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రంవద్ద భారి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఆయన వెంట మెప్మ పిడి కిరణ్‌కుమార్, భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, తహశీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓ గోపాల కిషన్‌రావ్, డిప్యూటీ తహశీల్దార్ నాగేశ్వరాచారి తదితరులు ఉన్నారు.

ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ ఎన్నిక
చింతపల్లి, డిసెంబర్ 22; మండలంలోని నసర్లపల్లి గ్రామ ఉప సర్పంచ్ ఎన్నిక మంగళవారం ఏకగ్రీమైంది. గ్రామపంచాయతీలో మెత్తం 10మంది వార్డు సభ్యులు ఉండగా ఉపసర్పంచ్ ఎన్నికకుగాను 9మంది సభ్యులు హాజరయ్యారు. ఈ ఎన్నిక ఈఓఆర్‌డి గీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీ లేకపోవటంతో సభ్యులందరూ గ్రామ ఉప సర్పంచ్‌గా దాసరి మల్లయ్యను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో సర్పంచ్ మల్లిక, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, తొమ్మది మంది వార్డుసభ్యులు పాల్గొన్నారు.

జీవో నెం.8ను ఉపసంహరించుకోవాలి
నకిరేకల్, డిసెంబర్ 22: బిసి క్రిమిలేయర్ విధానం జీవోనెంబర్ 8ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో బిసిలు పెద్దఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉండాలని బిసి సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య బిసిలకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరుగుతున్న బిసి సమావేశానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లకు పట్టణంలో బిసిసంఘ రాష్ట్ర కార్యదర్శి అరూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ వేధిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరులో సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసి విద్యార్థులకు గత రెండు సంవత్సరాల నుంచి చెల్లించాల్సిన రూ.1800కోట్ల స్కాలర్‌షిప్‌లను, ఈ సంవత్సర బకాయిలు 2వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. హిజ్రాలకు ప్రత్యేకమైన కేటగిరిన ఏర్పాటుచేసి ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించాలన్నారు. వారిని కూడా బిసి జాబితాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బిసి క్రిమిలేయర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం యువజన విభాగం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు నాగరాజు, విద్యార్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు నూక కిరణ్, నియోజకవర్గ అధ్యక్షులు సకినాల రవి, గోగికార్ పరమేష్, నడికుడి వెంకటేశ్వర్లు, మేడిపల్లి సైదులు, బండపల్లి శ్రీను, ఎంఢి అబ్దుల్ మాజీద్, పోగుల ఉపేందర్, బొడ్డు కృష్ణ, సంపత్, రమేష్, వలీ, సైదులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ తరగతులతో విద్యనందించేందుకు కృషి
బొమ్మలరామారం, డిసెంబర్ 22: మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రామానుజం జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. గణిత, భౌతిక, సాంఘిక శాస్థ్రాలకు సంబంధించిన అంశాలలో విద్యార్థులు 120ప్రయోగాలను ప్రదర్శించారు. డిప్యూటి డిఈఓ మదన్‌మోహన్ ప్రదర్శనలను తిలకించి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ విద్యతోపాటు బోధనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. ప్రతి పాఠశాలలో వౌలికవసతులు కల్పించేందుకు నిధులు మంజూరుచేస్తున్నట్లుగా తెలిపారు. రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా ఉన్నత పాఠశాలకు ప్రతి సంవత్సరం 50వేల రూపాయలను అందజేస్తున్నామన్నారు. మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలోని ప్రయోగాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఈఓ వెంట ఎంపిడిఓ క్రిష్ణారెడ్డి, ఎంఈఓ సురేందర్‌రెడ్డి, ప్రధానోపాద్యాయులు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్ కెంసారం లక్ష్మి, ఎస్‌ఎంపి చైర్మన్ లక్ష్మికాంతం, ఉపాధ్యాయులు ఉపేందర్‌రావ్, బిక్షమయ్య, స్టాలిన్, పట్ట్భాసీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.