డెహ్రాడూన్‌లో ఫుల్ మూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, డాలీశర్మ, నదీమ్ భార్గవ్, కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ ప్రధాన తారాగణంగా గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ పతాకంపై దీపక్ బల్‌దేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ తెలుగు, హిందీ భాషలలో రూపొందిస్తున్న చిత్రం ‘్ఫల్ మూన్’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈనెల 7 నుండి డెహ్రాడూన్‌లో 20 రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ- అందరికీ నచ్చే కథ, కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్ అనే ఉపశీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రంలో మూడు జంటల కథ ఉంటుందని, ఆ తరువాత సిమ్లా, కసోల్‌లో చిత్రీకరణ జరుపుతామని, అందరికీ నచ్చే ఎలిమెంట్స్‌తో చిత్రీకరిస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:అభిలాష్ గొలిడె, కెమెరా:కన్న, మాటలు:అశ్వినీసింగ్, నిర్మాత:ప్రకాష్ ఠాకూర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దీపక్ బల్‌దేవ్. (చిత్రం) హర్షకుమార్, డాలీశర్మ