జాతీయ వార్తలు

ప్రజల్లో మార్పుతోనే స్వచ్ఛ్భారత్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశుభ్రతను ప్రాథమిక హక్కుగా మార్చాలి
మరుగుదొడ్లు నిర్మించగానే సరికాదు..
వాటి నిర్వహణను సక్రమంగా చేపట్టాలి
కేంద్రానికి ‘వాటర్ ఎయిడ్స్’ నివేదిక

న్యూఢిల్లీ, నవంబర్ 22: పరిశుభ్ర భారతదేశాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా తొలిదశలో ఎనభై లక్షల మరుగుదొడ్లను నిర్మించటానికి చేపట్టిన భారీ పథకం అమలుకు మరిన్ని నిధులను కేటాయించడంతోపాటు ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావాలని ఒక సర్వే సంస్థ సిఫార్సు చేసింది. పరిశుభ్రతను ఒక ప్రాథమిక హక్కుగా రూపొందించాలని కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. 2019 నాటికి స్వచ్ఛ్భారత్‌ను నిర్మించాలన్న మోదీ ప్రభుత్వ ఆలోచన విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరిని స్వచ్ఛ్భారత్ నిర్మాణంలో భాగస్వామిని చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలు, చదువుకునే ఆడపిల్లలకు మరుగుదొడ్డి సదుపాయం లేకపోవటం పెనుశాపంగా మారుతోంది. కాలకృత్యాలను తీర్చుకోవటానికి బహిరంగ స్థలాలు, పంట పొలాలు, రైల్వేట్రాక్ పక్కన ఉన్నఖాళీ స్థలాలను వాడుకోవటం అత్యంత దౌర్భాగ్యమని ఈ సంస్థ పేర్కొంది. చదువుకునే ఆడపిల్లలకు పాఠశాలల్లో మరుగుదొడ్డి సదుపాయం లేకపోవటం, యుక్త వయస్సు వచ్చినవారికి అవసరమైన శానిటరీ నాప్‌కిన్స్ అందచేసే సదుపాయం లేకపోవటంతో ఆడపిల్లలు బడికి రావటానికి జంకుతున్నారని ఈ సర్వే తెలిపింది. పారిశుధ్ధ్య లోపంవల్ల అధిక సంఖ్యాకులు డయేరియాకు గురి అవుతున్నారని సర్వే నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఒక్క ఏడాదిలో ఎనభై లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని మోదీ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ ఎయిడ్స్ అన్న స్వచ్చంద సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. మరుగుదొడ్లను నిర్మించి చేతులు దులిపేసుకోకుండా, వాటి నిర్వహణపై దృష్టిపెట్టాలని ఈ సంస్థ సూచించింది. నీటి సరఫరాకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అలాగే నిర్మించిన మరుగుదొడ్లను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించేలా చూడాలని సలహా ఇచ్చింది. కొన్ని ప్రాంతాలలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ఇతర అవసరాలకు వాడుకుంటూ, బహిరంగ స్థలాలనే ఉపయోగిస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. తమకు లభించిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృక్ఫధం ప్రజలలో కలిగేలా చూడాలని ఈ సంస్థ అభిప్రాయపడింది.