ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గ అభివృద్ధి నిధులపై ఎపి అసెంబ్లీలో రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నియోజకవర్గ అభివృద్ధి నిధులను మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలకు ప్రభుత్వం కేటాయిస్తోందని ఎపి అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించారు. నిధుల కేటాయింపులో రాజకీయం జరుగుతోందని, వీటిపై తగిన విచారణ జరపాలన్నారు. ఈ దశలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, ఎవరు అడిగినా ఈ నిధులు కేటాయిస్తున్నామని, ఇందులో వివక్ష లేదన్నారు. దీనికి సంతృప్తి చెందని వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పది నిమిషాల సేపు సభను స్పీకర్ కోడెల వాయిదా వేశారు.