జాతీయ వార్తలు

‘గో ఎయిర్’కు బాంబు బెదిరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: ముంబయి వెళ్లాల్సిన గో ఎయిర్ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో నాగ్‌పూర్‌కు మళ్లించారు. 150 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌లో బయలుదేరిన గో ఎయిర్ జి8 243 విమానం 9.29కి నాగ్‌పూర్‌లో సురక్షితంగా దిగింది. విమానం భువనేశ్వర్‌లో ఉదయం 8.20కి బయలుదేరింది. విమానంలో బాంబు పెట్టినట్టు వచ్చిన ఫోన్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రయాణికులు విమానం నుంచి దించేసిన భద్రతా అధికారులు ఆసాంతం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని ఊపిరి పీల్చుకున్నారు. తరువాత విమానాన్ని ముంబయికి పంపించినట్టు గో ఎయిర్ వర్గాలు వెల్లడించారు. ఇలా ఉండగా భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించినట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శరద్ కుమార్ వెల్లడించారు. శనివారం ఉదయం 8.42 గంటల ప్రాంతంలో మూడు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చినట్టు ఆయన తెలిపారు. హిందీ, ఒరియాలో మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి ఎయిర్‌పోర్టు మేనేజర్‌తో అసభ్యకరంగా మాట్లాడినట్టు చెప్పారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో ముంబయి, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అజ్ఞాత వ్యక్తి టెలిఫోన్ నెంబర్‌ను పోలీసులకు అందచేసినట్టు శరద్‌కుమార్ చెప్పారు. డిప్యూటీ కమిషనర్ సత్యబ్రత్ భోయి కేసు దర్యాప్తు చేస్తున్నారు.