హైదరాబాద్

గ్రేటర్‌లో కాంగ్రెస్ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 25: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని కార్వాన్ బి-బ్లాక్ అధ్యక్షుడు కె.చంటిబాబు అన్నారు. సోమవారం లంగర్‌హౌస్ ప్రశాంత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి కొట అక్షిత పవన్‌కుమార్ గౌడ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే అభివృద్ధి చేందిందని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ గెలిచిన సుమారు రెండేళ్లు గడిచినప్పటికిని ఎలాంటి అభివృద్ధి చెందలేదని అన్నారు. గొప్పలు చెప్పుకోవడం మాత్రమే ఎక్కడా అభివృద్ధి లేదని ఆరోపించారు. లంగర్‌హౌస్ డివిజన్ అధ్యక్షుడు కొట నర్సింహ్మాగౌడ్ మాట్లాడుతూ నగర అభివృద్ధే తమను గెలిపిస్తుందని అన్నారు. గిరి, గోపిగౌడ్, విజయ్ ఆనంద్ పాల్గొన్నారు.
షేక్‌పేట్‌లో..
రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందుతానని షేక్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మకూరి సుధాకర్ (లడ్డు) అన్నారు. సోమవారం షేక్‌పేట్ డివిజన్ గుల్సన్ కాలనీలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. తాను గతంలో కార్పొరేటర్‌గా ఉండి సుమారు 26కోట్లు రూపాయాలతో డివిజన్‌లో పలు అభివృద్ధి పనులు చేసినట్లు పేర్కొన్నారు. డ్రైనేజీ, మంచినీటి పైపులు, విద్యుత్, రోడ్లు పనులను చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చాంద్‌పాషా, గౌస్ పాషా, శివకుమార్, నాగులు, విజయలక్ష్మీ పాల్గొన్నారు.
ఐఎస్‌సదన్‌లో..
సైదాబాద్: ఐఎస్‌సదన్ డివిజన్‌లో కాంగ్రెస్ మెజారిటీతో గెలవడం ఖాయమని అభ్యర్ధి కుంట విద్యాభీమార్జున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పార్టీనాయకులు,కార్యకర్తల తో కలిసి డివిజన్ పరిధిలోని చింతల్‌బస్తీ, ఖాజాబాగ్,ఇంద్రప్రస్థ కాలనీలలో పాదయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలు, బస్తీల వాసులు కాంగ్రెస్‌కు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని అన్నారు. కార్యక్రమంలో యాకత్‌పుర కాంగ్రెస్ ఇన్‌చార్జి మైనంపాటి అశ్విన్‌రెడ్డి, బి-బ్లాక్ అధ్యక్షుడు భీమార్జున్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రఘుపతి నాయుడు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి జరిగిందని సైదాబాద్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్ధి కొత్తకాపు అరుణ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని రెడ్డిబస్తీ, జయనగర్, ఎల్‌సిహెచ్‌కాలనీ, బ్యాంక్ కాలనీలలో పాదయాత్ర ద్వారా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌కి ఓటువేసి గెలిపించాలని అభ్యర్ధించారు. డివిజన్ అభివృద్ధిలో విశ్వసనీయత, నిబద్ధతను పరిగణలోకి తీసుకుని సైదాబాద్ వాసులు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. బి-బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, రమణాకర్, భాస్కర్‌రెడ్డి, జి.కృష్ణ, మదన్‌బాబు పాల్గొన్నారు.
జంగమ్మెట్‌లో..
చాంద్రాయణగుట్ట: తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని ఆ పార్టీ జంగమ్మెట్ డివిజన్ అభ్యర్థి పర్వతాల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పార్టీ అనుచరులతో కలిసి జంగమ్మెట్ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు వెంకటేష్, చింటు, ఎన్.ప్రమోద్‌రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.
మన్సురాబాద్‌లో..
వనస్థలిపురం: మన్సురాబాద్ డివిజన్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేండ్లలో ఎంఎల్‌ఏగా ఉన్న సుధీర్‌రెడ్డి స్థానికంగా అనేక అభివృద్ధి పనులు నిర్వహించారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్, టిడిపిల ఆశలు గల్లంతవుతాయని ఆయన అన్నారు. జక్కిడికి మద్దతుగా ఆయన సతీమణి ప్రసన్న కూడా తన భర్తకు ఓటేసి గెలిపించమని ప్రచారం నిర్వహించారు.
ఉన్నత విద్యను అభ్యసించిన తాను ప్రజా సేవకోసమే రాజకీయాలలోకి వచ్చి జిహెచ్‌ఎంసి ఎన్నికలలో పోటీచేస్తున్నానని వనస్థలిపురం కాంగ్రెస్ అభ్యర్థి పి.మహేష్ యాదవ్ కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్, వనస్థలిపురం, క్రాంతిహిల్ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి.ఈశ్వరమ్మ యాదవ్ కోరారు. కొనే్నళ్లుగా ఈ ప్రాంత ప్రజలకు తాను అందుబాటులో ఉంటున్నానన్న విషయాన్ని మహేష్ గుర్తు చేశారు.
సిపిఐ ప్రచారం
చాంద్రాయణగుట్ట: జిహెచ్‌ఎంసి ఎన్నికలలో భాగంగా జంగమ్మెట్ డివిజన్‌లో సిపిఐ ఆభ్యర్థి ఇటి నరసింహ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ పాతబస్తీలో ఎంఐఎం పార్టీని ఎదుర్కొనే శక్తి సిపిఐ పార్టీకి ఉందన్నారు.
జంగమ్మెట్‌లో సిపిఐ ఆభ్యర్థిని గెలిపించాలని కోరుతూ పలువురు మహిళ న్యాయవాదులు ప్రచారం చేశారు. ఓటు అనే అయుధంతో పాతబస్తీలో పాతుకుపోయిన ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సిపిఐ నాయకులు ఖలీం, మునీర్‌పటేల్, సిద్ధికి, మహ్మద్ అఫ్జల్, యాదగరి, శ్రీనివాస్, ఆరీఫ్‌ఖాన్, అనిత, హేమలత, అలివేలు పాల్గొన్నారు.