సంపాదకీయం

‘గులాబీ’ ఘనవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వికాసానికి హైదరాబాద్ మహానగర పాలిక-జిహెచ్‌ఎమ్‌సి- ఎన్నికల ఫలితాలు పరాకాష్ఠ. తెలంగాణ రాష్ట్ర సమితి-తెరాస- ఈ స్ఫూర్తికి ప్రతీక. జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికలలో సాధించిన ఘన విజయంతో తెరాస ప్రభావం తెలంగాణ రాష్టమ్రంతటా సర్వ సమగ్రంగా ప్రస్ఫుటిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తెరాస వల్ల మాత్రమే సాధ్యమైందన్న వాస్తవం పట్ల ప్రజల విశ్వాసం జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల ద్వారా మరో సారి ధ్రువపడింది. తెరాస సాధించిన చారిత్రక విజయం ఇది. పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఘన విజయ వ్యూహాన్ని విరచించడం ఈ చరిత్ర..ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు జరపడం ఈ చరిత్ర. దశాబ్దుల గతంలోకి తిరిగి చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో అధికారం చెలాయించిన పార్టీ వారు రాజధానిలోను అధికారం చెలాయించిన వాస్తవం దృశ్యమానం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతం ఇది. 2009లో తెరాస తన ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించిన సమయంలో కూడ జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో ప్రస్ఫుటించిన తెరాస ప్రభావం ఆ ఎన్నికలలో హైదరాబాద్ ప్రాంగణంలో గోచరించలేదు. అప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెలాయించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత మేయర్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గత శాసనసభ ఎన్నికల నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ పూర్తయిపోయింది. తెలంగాణ ఏర్పడి ఉంది. అయినప్పటికీ ఇతర జిల్లాలలో సాధించిన స్థాయిలో తెరాస రాజధాని పరిధిలో ఘన విజయం సాధించలేదు. ఇప్పు డు జిహెచ్‌ఎంసి ఎన్నికలలో తిరుగులేని శక్తి. ఎదురులేని ఏకైక పక్షంగా తెరాస అవతరించడం వినూతన చరిత్ర.
జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల ఫలితాలకు చారిత్రకతను దిద్దుతున్న మరో మహా పరిణామం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీ-ఎమ్‌ఐఎమ్-వారి ఆధిపత్యం అంతరించడం. దశాబ్దుల తరబడి ఏ పార్టీవారు జిహెచ్‌ఎంసిని నిర్వహించినప్పటికీ ఎమ్‌ఐఎమ్ వారి మద్దతు అనివార్యమైపోయింది. ఈ అనివార్యం సృష్టించిన వైపరీత్యాలు హైదరాబాద్ జన జీవనాన్ని నిరంతరం ఆందోళనగ్రస్తం చేశాయి. ఇందుకు ఏకైక కారణం జిహెచ్‌ఎంసిలో ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలకు కాని, ప్రాంతీయ పార్టీలకు కాని స్పష్టమైన మెజారిటీ లభించకపోవడం. ఫలితంగా హైదరాబాద్ పాతబస్తీలో ప్రాబల్యం వున్న మజ్లిస్ నగరపాలిక నిర్వాహకులను నిరంతరం నిర్దేశించ గలిగింది. తన బలానికి మించిన రీతిలో అధికారంలో భాగస్వామి కాగలిగింది. అనేకసార్లు మేయర్ పదవిని కైవసం చేసుకోగలిగింది. మజ్లిస్ వారి ఈ బెదిరింపు రాజకీయాలు ఇక ముందు సాగబోవన్నది ఈ ఎన్నికల ఫలితాల వల్ల తేటతెల్లమైన సజీవ వాస్తవం. ఈ వాస్తవానికి సజీవ విగ్రహం తెరాస. అనేక ఏళ్ల తర్వాత జిహెచ్‌ఎంసి లో స్పష్టమైన మెజారిటీని సాధించిన తెరాస ఎమ్‌ఐఎమ్ బెదిరింపుల ప్రాధాన్యాన్ని ‘సున్న’ చేయగలిగింది. ఎమ్‌ఐఎమ్ కోరలు ఊడిపోయినట్లయింది. ఆవుమాంసంతో విందులు చేయడానికి ఈ పార్టీ పన్నిన పథకం వమ్మయిపోవడం చారిత్రక పరిణామం. ‘సహేంద్ర తక్షకాయస్వాహా..’ అన్నది సనాతన స్ఫూర్తి. ‘తక్షకుణ్ణి రక్షించబోయిన ఇంద్రుడు కూడ యజ్ఞజ్వాలలకు ఆహుతుడయ్యే ప్రమాదం సంభవించింది. ఈ చరిత్ర జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల్లో పునరావృత్తమైందనడానికి భాజపా వారి భంగపాటు నిదర్శనం. తెలుగుదేశం పార్టీతో జట్టుకట్టడం ద్వారా భాజపా మరోసారి పతనమైపోయింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తెరాస హైదరాబాద్ ఎన్నికల ద్వారా తన ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించుకోగలిగింది. భాజపా వారు తెరాసను చూసి నేర్చుకోలేదు. నేర్చుకొని ఉంటే లోక్‌సభ ఎన్నికల విజయాన్ని ఊతంగా చేసుకొని హైదరాబాద్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నైనా ఎదిగి ఉండేవారు. తెలుగుదేశంతో జట్టు కట్టడం వల్ల తక్షకునితో జట్టు కట్టిన ఇంద్రుని వలె భాజపా భంగపడింది. ఎన్నికల ప్రచారానికి ముందే భాజపా కూలబడిపోయింది.
అంతర్జాతీయ స్థాయి బృహత్ మహానగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ఆధునిక భారత స్వరూప స్వభావాలకు ఒక సజీవ ప్రతీక. ప్రజాస్వామ్యం సర్వమత సమభావన వంటి సనాతన మైన లక్షణాలు నవభారత జాతీయ స్వభావంలో నిహితమై ఉన్నాయి. అందువల్ల అట్టడుగు రాజ్యాంగ వ్యవస్థకు స్వరూపమైన పురపాలక, గ్రామ పంచాయతీ, నగర పాలక, బృహత్ మహానగర పాలక సంస్థల నిర్వాహకులను ఎన్నుకుంటున్న తీరు ప్రజాస్వామ్యానికి సర్వమత సమభావ వ్యవస్థకు నిజమైన ప్రతిబింబం. జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల సందర్భంగాను, ఈ రెండు ఆదర్శాలకు అఘాతం ఏర్పడడం యథాతథ స్థితికి నిదర్శనం. ఓటర్లను ప్రలోభపెట్టడం, ఎమ్‌ఐఎమ్ వంటి మతోన్మాద పక్షాల వారు ప్రత్యర్థులపై దాడులు చేయడం యథాతథ స్థితికి నిదర్శనం. ఓడిపోతామన్న సందేహ గ్రస్తులైన ఎమ్‌ఐఎమ్ వారు చేసిన దాడులు నిజానికి సర్వమత సమభావ వ్యవస్థపై జరిగిన దాడు లు. ఎమ్‌ఐఎమ్ వారి విజయ విశ్వాసం ప్రస్ఫుటించిన చోట్ల కూడ వారు ప్రత్యర్థులను కొట్టి గాయపరచడం ఇందుకు నిదర్శనం. గెలుపులోను, ఓటమిలోను కూడ మజ్లిస్ లక్ష్యం సర్వమత సమభావాన్ని మట్టుపెట్టడమన్నది మరోసారి ధ్రువపడిన నిజం. ఈ దుందుడుకు చేష్టల కారణంగానే పురానాపూల్ డివిజన్‌లో మళ్లీ పోలింగ్ జరుపవలసి వచ్చింది. ఈ రీపోలింగ్ కారణంగా మహానగరం మొత్తంమీద వోట్ల లెక్కింపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా పడింది. మజ్లిస్ చేయగలిగిన నష్టం ఇదీ...దాదాపు అన్ని పార్టీల సభలలోను ప్రదర్శనలలోను, ఊరేగింపులలోను కార్యకర్తల సంఖ్య కంటె కిరాయి జనం సంఖ్య చాలా అధికంగా ఉండడం అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యం బండారం. అన్ని పార్టీల బండారం ఇదే కనుక ఏ ఒక్క పార్టీని కాని తప్పు పట్టనవసరం లేదు. ఓటుకింత అన్న సూత్రం ప్రకారం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వోటర్లకు ముట్టచెప్పడం గురించి ఎవ్వరికీ ఆశ్చర్యకరం కాదు. ప్రజాస్వామ్య పరిణితి అంటే ఇదేనా? అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా అవినీతి అభియోగాలు చేయడం జిహెచ్‌ఎమ్‌సి ఎన్నికల ప్రచార ఇతివృత్తం.
ఈ ఇతివృత్తాన్ని మార్చవలసిన గురుతర బాధ్యత ఇప్పుడు తెరాసది. కేసీఆర్ స్వయంగా చెప్పినట్టు ఎన్నికల విజయంతో తెరాస బాధ్యత మరింత పెరిగింది. ఈ బాధ్యతను విస్మరించడం వల్లనే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ప్రజాస్వామ్యం ప్రస్థానంలో ఈ పాతాళ పతనం, మరో చారిత్రక ఘట్టం. కాంగ్రెస్ పాలనలో మేయర్ పదవిని నిర్వహించిన వారు సైతం పరాజయం పాలు కావడం తెరాస విజయ ప్రభంజన ఉద్ధృతికి నిదర్శనం. జిహెచ్‌ఎంసి ఎన్నికలలో వంద స్థానాలు గెలువకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తారకరామారావు ప్రకటించినప్పుడు ప్రత్యర్థులు ఈ ప్రతిజ్ఞను అహంకార చిహ్నంగా ప్రచారం చేశారు. అది అహంకారం కాదని, ఆత్మవిశ్వాసమని ఇప్పుడు ధ్రువపడింది. భాగ్యనగర పౌరులు ఈ విశ్వాసాన్ని విజయవంతంగా నిరూపించారు. చారిత్రక మహా విజయమిది.