తెలంగాణ

‘గ్రేటర్’ పరాజితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు టిడిపి-బిజెపి కూటమికి ఘోర పరాజయాన్ని చవి చూశాయి. గ్రేటర్ ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రముఖులలో...కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విక్రమ్‌గౌడ్ పరాజయం పాలయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ బండా కార్తికరెడ్డికి (తార్నాక) ఓటమి చవి చూడకతప్పలేదు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కోడలు ఎల్‌బి నగర్ సర్కిల్‌లోని ఆర్‌కె పురం డివిజన్‌లో బిజెపి అభ్యర్థి రాధా వీరనగరి చేతిలో ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సోదరుడు ప్రేమ్‌దాసుగౌడ్ వారి సొంత డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్‌పేట నుంచి కానీ, శాసనసభలో బిజెపి ఫ్లోర్‌లీడర్ డాక్టర్ లక్ష్మణ్ సొంత నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థులు ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు.