రాష్ట్రీయం

గీత దాటితే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, శాంతి భద్రతల విషయంలో ఆందోళనకారులు గీత దాటితే దండన తప్పదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై శుక్రవారం విశాఖ పర్యటనలో ఉన్న హోంమంత్రి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు ఉద్యమం శాంతి యుతంగా జరిగితే తాము ఏ విధమైన ప్రతి చర్యకు దిగమని, గీతదాటి ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ప్రవర్తిస్తే మాత్రం చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఆమరణ నిరాహార దీక్షకుదిగిన ముద్రగడ పద్మనాభంతో నేరుగా ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరిపేది లేదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ వాస్తవాన్ని గుర్తించి దీక్ష విరమించుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత నెల 31న తునిలో జరిగిన కాపు సింహగర్జన సందర్భంగా చోటుచేసుకున్న విద్వంసకర పరిస్థితులకు సంబందించి విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మంత్రులతో కూడిన ఉపసంఘం నియమించడం ద్వారా కాపు రిజర్వేషన్లకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ సహా కొన్ని రాజకీయ పక్షాలు కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం వెనుకబడిన వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లకు ఎటువంటి నష్టం కలగకుండా, కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమన్నారు.