హైదరాబాద్

గులాబీ గుబాళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గలాబీ గుబాళించింది. ఎవరికెన్ని సీట్లు అన్న విషయంపై వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల నివేదికలు, రాజకీయ విశే్లషకుల అంచనాలను మించి కారు దూసుకెళ్లిపోయింది. మొత్తం 150 డివిజన్లలో వంద పైచిలుకు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన టిఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి రాజధానిలో సత్తా చాటుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నగరంలోని 24 ప్రాంతాల్లోని 36 పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా మొదటి రౌండ్ నుంచి ఆధిక్యతలో కొనసాగిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు చివరిరౌండ్ వరకు మెజార్టీలో కొనసాగుతూ విజయం సాధించారు. తెరాస అభ్యర్థుల ఎంపిక, ప్రముఖుల ప్రచారం బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికే వృద్థులు, వికలాంగులు, వితంతువులకు అందజేస్తున్న ఆసరా పెన్షన్‌తో పాటు డబుల్ బెడ్ రూం స్కీం గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ తరపున డబుల్ ఢంకా మోగించిందని చెప్పవచ్చు. దీంతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన 108 మ్యాజిక్ సంఖ్యను టిఆర్‌ఎస్ అధిగమించిందని చెప్పవచ్చు. ఉద్యమ దశ నుంచి కూడా నగరంలో పెద్దగా క్యాడర్ లేని టిఆర్‌ఎస్ పార్టీ కొత్తగా పార్టీలో చేరిన నేతలను అభ్యర్థులుగా రంగంలోకి దింపినా, గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చిందన్న విషయం శుక్రవారం నాటి ఫలితాలతో తేలిపోయింది. శుక్రవారం రాత్రి జిహెచ్‌ఎంసి అధికారులు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం టిఆర్‌ఎస్ 99 స్థానాలను గెలుచుకోగా, మజ్లిస్ 33 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 60 స్థానాల్లో పోటీకి నిలిచిన మజ్లిస్ పార్టీ ఈసారి కాంగ్రెస్‌తో కాకుండా అధికార పార్టీ టిఆర్‌ఎస్‌తో అవగాహనవంతమైన పొత్తుతో పోటీ చేసినా, అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుని మజ్లిస్‌కు సీట్లుతగ్గి, టిఆర్‌ఎస్ సింగిల్ పార్టీగా సెంచరీపై చిలుకు స్థానాల్లో విజయం సాధించింది. అంతేగాక, మజ్లిస్ కంచుకోటగా భావిస్తున్న పాతబస్తీలో కూడా కారు వేగంగా దూసుకెళ్లి పలు డివిజన్లలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇక మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పోటీ చేసిన మెహిదీపట్నం డివిజన్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థి 5356 ఓట్లు సాధించి విజయం సాధించగా, సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్థి2320 ఓట్లు సాధించి అన్ని రౌండ్లలో గట్టి పోటీనే ఇచ్చారు. ఇక టిడిపి, బిజెపి మిత్రపక్షాలు మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఈరెండు పార్టీలు కూడా టికెట్ల కేటాయింపు విషయంలో కాస్త విఫలమయ్యాయని చెప్పవచ్చు. చాలా స్థానాల్లో టిడిపికి చెందిన అభ్యర్థులు టిఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా గట్టి పోటీనిచ్చినా, చివరి రౌండ్లలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఆధిక్యతను చాటుకుని గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారై ఒకే ఒక్క సీటును కైవసం చేసుకుంది.
ప్రముఖులకు తప్పని ఓటమి
గ్రేటర్ హైదరాబాద్ మొట్టమొదటి మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించి, రెండోసారి తార్నాక కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బండ కార్తీక చంద్రారెడ్డి, జాంబాగ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కొడుకు విక్రంగౌడ్‌కు గ్రేటర్ ఎన్నికల్లో అపజయం తప్పలేదు. ఇందుకు గ్రేటర్ ఎన్నికల ముందు ఆ పార్టీ నేతల మధ్య బయట విభేదాలు, టికెట్ల కేటాయింపునకు సంబంధించి రగిలిన అసంతృప్తి సెగలు, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సరైన ప్రచారం నిర్వహించకపోవటం వల్లే గ్రేటర్ ఎన్నికల్లో చుక్కెదురైందని చెప్పవచ్చు.