అక్షర

గణపతి ఆలయాల విశేషమాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట
ప్రసిద్ధ గణపతి ఆలయాలు
-కప్పగంతు వెంకట రమణమూర్తి
వెల: రూ.125/-లు
ప్రతులకు: గ్లోబల్ న్యూస్
బి2 ఎఫ్ 12, రామరాజానగర్,
సుచిత్రా సెంటర్
సుచిత్రా జంక్షన్ పోస్ట్
సికిందరాబాదు - 500067
ఫోన్ నెం. 9246165059

‘కలౌచండీ వినాయకౌ’ అని ఉపనిద్వచనం. కలియుగంలో విఘ్నేశ్వరుడు భక్తుల పాలిట కల్పవృక్షం. కనుకనే నమోగణేభ్యో గణపతిభ్యశ్చవోనమః అంటూ ప్రతి కార్యారంభానికి ముందుగా పూజించేది విఘ్ననాయకుడైన వినాయకుణ్ణే.
ఈ వినాయకోత్పత్తి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వేదాలు, స్మృతులు కూడా గణపతికి ఆధిపత్యానే్న ఇవ్వమని చెబుతున్నాయి. అట్లాంటి వినాయకుని గురించి వివరాలన్నీ కప్పగంతు వెంకట రమణమూర్తి గారు ‘‘తెలుగునాట ప్రసిద్ధ గణపతి ఆలయాలు’’ అన్న పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పొత్తంలో కాణిపాక వరసిద్ధి వినాయకుడు, శ్రీశైలంలోని సాక్షిగణపతి, రాయదుర్గంలోని దశభుజ గణపతి వంటి 16 దేవాలయాల విశేషాలను సమగ్రంగా వివరించారు. వీటితోపాటుగా గణపతి సర్వదేవతా స్వరూపునిగాను ఎంతటి ప్రాచీనకాలంనుంచి ఈ వినాయకుడు పూజలందుకుంటున్నాడో కూడా ముందుగా వివరాణాత్మకంగా మొదట చెప్పి ఆ తరువాత వినాయకుని అవతారాల విశేషాలను ఉటంకించారు.
ఆ తరువాత గణపతి ఆకృతి లోని విశేషాన్ని వివరిస్తూ వినాయకుడు ధరించే వివిధ వస్తువులగురించికూడా చెప్పారు. భగవంతుడు ఒక్కడే అయినా మానవుని బుద్ధికి తోచినవిధంగా రూపాన్ని భావించి పూజించడం అనాదిగా వస్తున్నదే. భగవంతుడొక్కడే అయినా అనేకానేక రూపాలు, నామాలు ఏర్పడి ఉన్నాయి. వీటికితోడుగా వివిధ ప్రాంతాలలోని సంస్కృతి ని బట్టి ఆచారాలు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. వాటి ఆధారంగా రూపుదిద్దుకున్న భగవంతుడిని ఆరాధించడంలో వివిధ పద్ధతులు ఏర్పడ్డాయి. అట్లానే ఆదిదేవుడిగా, విఘ్ననాశకుడిగా కీర్తిస్తున్న వినాయకునికీ కూడా అనేక రూపాలు ఏర్పడ్డాయి. ఈ రూపాలన్నీ కూడా పురాణ కథల ద్వారా ఏర్పడినవేనని వాటికిసంబంధించిన సమాచారాన్ని కప్పగంతుల వారు ఈ పుస్తకంలో తెలియచేసారు. వీటి అన్నింటితో పాటుగా గణేశుని స్తుతించడానికి వీలుగా ...చతుర్వేదాలలో, పురాణాలలో, సంహితలలో ఉన్న గణేశ సమాచారానికి అనుగుణంగా గణేశుని (ముద్గల పురాణోక్త గణేశ న్యాసం, తులసీదాస కృత శ్రీగణేశస్తుతి, షోడశనామస్తోత్రం వంటి) అష్టకాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, స్తోత్రాలు, కవచము, స్తుతులు, సూక్తాలు, ఇట్లాంటివన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇవే కాక వినాయకుని వ్రతకల్పాన్ని కూడా జోడించారు. దూర్వాయుగ్మ మహిమను ఉటంకిస్తూ ... వినాయకుని గరిక ఎందుకు ప్రీతిపాత్రమైందో వివరించారు. ఈ గణపతి ఆరాధనలే కాకుండా గణపతికి ఏరకమైన నైవేద్యాన్ని సమర్పించాలో కూడా సూచించారు. వివిధ ప్రాంతాల్లో గణపతి నివేదనలను గూర్చి కూడా వివరణ ఉంది.
సరళమైన భాషలోను సరసమైన ధరలోను ఉన్న ఈ పుస్తకాన్ని అందరూ చదివి వినాయకుని గూర్చిన వివిధ విషయాలను తెలుసుకోవచ్చు.

-రాయసం లక్ష్మి