జాతీయ వార్తలు

బంగారం ధరకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధరకు కూడా రెక్కలొచ్చాయి. శుక్రవారం ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 850 పెరిగి రూ. 29,650కి చేరుకుంది. గత 11 రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న బంగారం ఈ 11 రోజుల్లోనే 2,600 రూపాయలు పెరిగింది. ఈ ఏడాది వరసగా ఇన్ని రోజులు బంగారం ధర పెరగడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం మన దేశంలో బంగారం ధరలకు రెక్కలు రావడానికి ప్రధాన కారణమయినప్పటికీ, పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి ఆభరణాల తయారీదారులు పెద్ధ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండడం, డాలరుతో రూపాయి విలువ తగ్గిన కారణంగా దిగుమతులు మరింత ప్రియం కావడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. వెండి కూడా రూ. 750 రూపాయలు పెరిగి కిలో రూ.37,850కి చేరుకుంది.
గురువారం ఒక్కరోజే న్యూయార్క్‌లో బంగారం ధర ఔన్స్‌కు 4.14 శాతం పెరిగి 1246.40 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 850 పెరిగి పది గ్రాములు రూ. 29,650కి చేరుకుంది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం కూడా అదే స్థాయిలో పెరిగి 29,500కు చేరుకుంది. 2014 మే 16 తర్వాత బంగారం ధర ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. వెండి సైతం అదే బాటలో సాగుతూ రూ. 750 పెరిగి కిలో రూ. 37,850 కు చేరుకుంది. వెండి నాణేల ధర అయితే ఏకంగా వెయ్యి రూపాయల వరకు పెరిగింది.