రాష్ట్రీయం

గిరిజన గ్రామాల నుంచి తాగుబోతులను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 15: కాయకష్టంతో రోజంతా పనిచేసి సంపాదించుకున్న మొత్తాన్ని మద్యం కోసం ఖర్చు చేసి కుటుంబాలను పేదరికంలోకి నెట్టేసే తాగుబోతులను గిరిజన గ్రామాల నుంచి బహిష్కరించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరిసింహన్ అన్నారు. ప్రతీ కుటుంబంలో యజమాని తప్పనిసరిగా పనిచేయాలన్నారు. మహిళలు పనిచేస్తే భర్తలు మద్యం తాగుతూ వారి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారని, అటువంటి పరిస్థితులను పారదోలాలంటూ గవర్నర్ పిలుపునిచ్చారు. కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏదో ఒక పనిచేయాలని, తద్వారా కుటుంబం పేదరికం నుండి బయటపడుతుందని గవర్నర్ నరసింహన్ గిరిజనులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో సోమవారం గవర్నర్ సతీసమేతంగా పర్యటించి, గిరిజనులతో, మహిళా సంఘాలతో నేరుగా మాట్లాడారు. మల్లి గురుకుల పాఠశాలను సందర్శించిన గవర్నర్ అక్కడి నుండి సీతంపేట పిఎంఆర్‌సి కేంద్రానికి చేరుకోగా, అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం పిఎంఆర్‌సి ప్రధానగేటు పక్కన ఉన్న ఓ పూరిగుడిసెలోకి వెళ్ళి ఆ కుటుంబ యజమాని వెంకటరావు, కుటుంబసభ్యులతో గవర్నర్ మాట్లాడారు. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. ఏమి పనిచేస్తున్నారు.. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. రేషన్ ఇస్తున్నారా.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో అందరూ కష్టపడాలని సూచించారు. అక్కడి నుండి పిఎంఆర్‌సి కేంద్రంలోని మహిళా సంఘాల సభ్యులను వారి జీవనశైలి అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు పిల్లలు మధ్యలోనే పాఠశాల మానేస్తూ డ్రాపౌట్లుగా మారుతున్నారని, దీనికి గల కారణం ఏమిటంటూ ఐటిడిఎ పివో వెంకటరావును ప్రశ్నించారు. చిన్నారులందరూ తప్పనిసరిగా బడిలోనే ఉండాలన్నారు. అక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు కూడ ఇప్పుడు చదువుకోవాలని సూచించారు. స్వయంశక్తి మహిళాసంఘాల గ్రూపుల్లో ఎంత మంది గిరిజన మహిళలు ఉంటున్నారు.. వారు ఏం పనిచేస్తున్నారు అని సంఘం సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులు నెలకు ఎంత సంపాదిస్తారు, వారి కుటుంబ యజమానులు ఏమి పనిచేస్తారని కలెక్టర్ లక్ష్మినృసింహంను ప్రశ్నించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను వినియోగించుకోవాలన్నారు. పిల్లలందరూ చదువుకోవాలని సూచించారు. గ్రామాల్లో చదువుకొని పనిచేయకుండా ఎవరు ఉండకూడదన్నారు. అలాంటి వారితో ఎవరూ మాట్లాడకూడదని అన్నారు. మద్యం తాగేవారు ఆ అలవాటు మానుకోవాలని, సంపాదన అంతా దాచుకొని ఆరోగ్యంగా జీవించాలన్నారు. తాగుబోతులను గ్రామం నుండి బహిష్కరించాలని, పిల్లలందరినీ చదివించాలన్నారు. సీతంపేట-1 అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు పౌష్టికాహారం అందుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. అనంతరం మల్లి గురుకుల పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు.
కూర్మనాథుని దర్శించుకున్న గవర్నర్
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలోని ప్రఖ్యాత కూర్మనాథ క్షేత్రాన్ని రాష్ట్ర నరసింహన్ దంపతులు సోమవారం సందర్శించారు. గవర్నర్ దంపతులకు ఆలయ కార్యనిర్వాహణాధికారి, ఆలయ ప్రధానార్చకుడు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలుతో స్వాగతం పలికారు. బేడా మండపంలో కప్పస్తంభంగా భావించే స్తంభాన్ని గవర్నర్ దంపతులు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆశీర్వచనాలు పలికిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలు అందజేసారు.