ఆంధ్రప్రదేశ్‌

గుడిసె దగ్ధం చిన్నారి సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, ఫిబ్రవరి 19: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని హరిజనవాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో గుడిసె కాలిపోవడంతో చిన్నారి సాయివాణి(3) సజీవదహనమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన బ్రహ్మయ్య, జ్యోతి దంపతులకు నలుగురు పిల్లలు సాయి(8), సాయిలక్ష్మి(6), సాయివాణి(3), సుబ్బరాయుడు(ఏడాదిన్నర). బ్రహ్మయ్య తన కుటుంబంతో కలిసి హరిజనవాడలో ఓ గుడిసెలో ఉంటున్నాడు. అర్ధరాత్రి దాటాక విద్యుదాఘాతంతో గుడిసెకు నిప్పంటుకుంది. దీంతో అప్రమత్తమైన బ్రహ్మయ్య భార్యాపిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశాడు. కొద్దిసేపటి తరువాత చూసుకోగా రెండవ కూతురు సాయివాణి కనిపించలేదు. గుడిసెలోనే నిద్రిస్తున్నట్లు తెలుసుకుని భోరుమన్నాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి సాయివాణి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కళ్లెదుటే పసిపాప కాలిపోతుంటే రక్షించుకోలేకపోయామని భార్యాభర్తలు కన్నీరుమున్నీరయ్యారు. సాయివాణి స్థానిక శారదా విద్యాపీఠంలో నర్సరీ చదువుతోంది. మంటల్లో ఇంట్లోని 3లక్షల విలువచేసే బంగారు నగలు, నగదు, దుస్తులు సైతం కాలిపోయాయి.