బిజినెస్

డియాజియో-మాల్యా డీల్‌పై సెబీ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) చైర్మన్ పదవి నుంచి తప్పుకునే క్రమంలో డియాజియో-విజయ్ మాల్యా మధ్య కుదిరిన 515 కోట్ల రూపాయల ఒప్పందంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యుబి గ్రూప్‌లను ప్రభుత్వరంగ బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా ప్రకటించిన నేపథ్యంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్‌గా తప్పుకోవాలంటూ మాల్యాపై గతకొంత కాలంగా డియాజియో ఒత్తిడి తెస్తున్నది తెలిసిందే. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 6,963 కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ క్రమంలో గురువారం యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాల్యా ప్రకటించారు. ఇందుకుగాను మాల్యాకు 515 కోట్ల రూపాయల (75 మిలియన్ డాలర్లు)ను చెల్లించేందుకు డియాజియో అంగీకరించింది. మరోవైపు ఈ వ్యవహారాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా గమనిస్తున్నట్లు సమాచారం.
యుఎస్‌ఎల్ చైర్మన్‌గా ఎమ్‌కె శర్మ
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) నూతన చైర్మన్‌గా ఎమ్‌కె శర్మను నియమించినట్లు డియాజియో శుక్రవారం ప్రకటించింది. మాల్యా స్థాపించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌లో అంతర్జాతీయ లిక్కర్ దిగ్గజం డియాజియోకు ప్రస్తుతం అధిక వాటా ఉన్నది తెలిసిందే. యుఎస్‌ఎల్‌లో డియాజియోకు 54.78 శాతం వాటా ఉంది. ఈ క్రమంలోనే యుఎస్‌ఎల్ నిధులను మాల్యా.. తన గ్రూప్‌లోని ఇతర సంస్థల్లోకి తరలించారంటూ డియాజియో ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ముద్రపడిన మాల్యా.. చైర్మన్‌గా ఉండటం యుఎస్‌ఎల్‌కు మంచిది కాదని గట్టిగా పట్టుబట్టింది. దీంతో గురువారం మాల్యా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే యుఎస్‌ఎల్ గౌరవాధ్యక్షుడిగా మాల్యా కొనసాగనున్నారు.
బకాయిలను రాబడతాం: డియాజియో
విజయ్ మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ నుంచి 1,337 కోట్ల రూపాయల రుణాలను వసూలు చేసే ప్రక్రియ కొనసాగుతుందని డియాజియో ప్రకటించింది. చర్చల ద్వారాగానీ, న్యాయపరమైన చర్యల ద్వారాగానీ బకాయిలను రాబడతామని శుక్రవారం డియాజియో స్పష్టం చేసింది.
కాగా, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్‌గా తప్పుకున్న విజయ్ మాల్యా.. ఆ సంస్థ ఐపిఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మెంటర్‌గా కొనసాగనున్నారు. అంతేగాక మాల్యా తనయుడు డైరెక్టర్‌గా ఉండనున్నారు. తన కుటుంబంతో గడపడానికే ఇక తాను అధిక ప్రాధాన్యమివ్వదలుచుకున్నట్లు ప్రకటించిన మాల్యా.. బ్రిటన్‌కు వెళ్తానని చెప్పారు.