గుంటూరు

ట్రాక్టర్ బోల్తా.. సచివాలయ కూలీ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 18: తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల కోసం వెలగపూడికి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో ఓ కూలీ మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సచివాలయ భవన నిర్మాణ పనుల నిమిత్తం గుంటూరు నుంచి కంతేరు మీదుగా వెలగపూడికి కార్మికులు ట్రాక్టర్‌పై వెళుతున్నారు. కంతేరు - నిడమర్రు మధ్య ముసలయ్యకుంట వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామానికి గుర్రం వెంకటేశ్వరరావు(40) అక్కడికక్కడే మృతిచెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు ఫోన్ చేయటంతో క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ నగర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పరామర్శించారు. రాజధాని కూలీల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణ పనులకు వెళ్లే కార్మికులకు ప్రత్యేక వాహన, వైద్య సదుపాయాలు కల్పించాలని నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు వర్తించే అన్నిరకాల ప్రభుత్వ పథకాలను రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వర్తింపచేయాలని, రాజధాని నిర్మాణ కార్మికులకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేశారు.

మరో ఏఈకి చార్జిమెమో
* నాణ్యతా ప్రమాణాల పాతరకు ఫలితం
గుంటూరు (కార్పొరేషన్), జూలై 18: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని, పర్యవేక్షణ చేయలేని ఇంజనీరింగ్ అధికారులపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి కొరడా ఝుళిపిస్తున్నారు. పుష్కరపనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని అసిస్టెంట్ ఇంజనీర్ పిడుగురాళ్ల వెంకటేశ్వర్లును ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం విదితమే. అలాగే సోమవారం పలకలూరు మెయిన్‌రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా మరో అసిస్టెంట్ ఇంజనీర్ టివి రమణపై చర్యలు తీసుకున్నారు. విధుల్లో బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఎఇ రమణకు వెంటనే చార్జ్ మోమో జారీ చేయాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డిని ఆదేశించారు. అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా స్థానిక పలకలూరు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పలకలూరు మెయిన్ రోడ్డు నిర్మాణానికి నాణ్యతలేని కంకరను వినియోగించడాన్ని గమనించి సంబంధింత డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజీనీర్ జి వెంకటేశ్వరరావును పూర్థిస్థాయి నివేదికను అందించాలని ఆదేశించారు. సంబంధిత బిటి హాట్‌మిక్స్ రోడ్డుకు రోడ్డులెవెల్‌లో హెచ్‌బిజి 40 ఎం.ఎం కంకర వినియోగించాల్సి ఉండగా తక్కువస్థాయి మెటీరియల్‌ను ఉపయోగించిన్నట్లు ధృవీకరిస్తూ తన నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఈ విషయంపై సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ టివి రమణపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే చార్జ్‌మోమో అందజేయాలని ఎస్‌ఇని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు చేపట్టకపోతే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు వెనకాడబోనని తెలిపారు.