గుంటూరు

కేంద్రబడ్జెట్‌కు నిరసనగా 8న బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈనెల 8వ తేదీన జరిగే రాష్టవ్య్రాప్త బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. శనివారం బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యుడు జొన్నా శివశంకర్ అధ్యక్షతన తూర్పుజిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం ప్యాకేజీ , నిధుల కేటాయింపు కానీ జరగలేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదన్నారు. కేంద్రంలోని బీజేపితో భాగస్వామిగా ఉన్న టీడీపీ మంత్రివర్గం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. పాశం రామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, వాటిని నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో దళితులపై దాడిచేసిన ప్రధాన నిందితులను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. దళితుల సమస్యలపై ఈనెల 23న గుంటూరులో జరిగే సభలో వేలాదిమంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.