తెలంగాణ

గిన్నిస్ రికార్డు కోసం.. మునివేళ్లపై పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 11: కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన రాపెల్లి శ్రీనివాస్ కాలి మునివేళ్లపై పరుగుతీసి ఔరా అనిపించాడు. గిన్నిస్ బుక్ రికార్డు చరిత్రలో ఇప్పటివరకు ఇలా పరుగెత్తిన ఘటనలు లేవు. ఆ అరుదైన ఘట్టానికి శ్రీనివాస్ తెరలేపి కేవలం నిమిషం వ్యవధిలో 137.15 మీటర్ల దూరం పరుగెత్తి రికార్డ్‌లో చోటుకు ప్రయత్నించాడు. అంబేద్కర్ స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం ఈ ఫీట్ జరుగగా, మేయర్ రవీందర్ సింగ్ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. శ్రీనివాస్ పరుగు మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడా ఆగకుండా నిమిషం వ్యవధిలో 137.15 మీటర్ల దూరం పరుగెత్తాడు. రాపెల్లి శ్రీనివాస్ చిన్నప్పటి నుంచే ఏదైనా సాధించాలన్న తపన ఉండేది. ఆ సంకల్పంతో కొనే్నళ్లుగా కాలి మునివేళ్లపై పరుగును సాధన చేశాడు. ఈ క్రమంలో గిన్నిస్ బుక్ రికార్డుకోసం దరఖాస్తు చేసుకోగా, ఇటీవలే అనుమతి రావడంతో శ్రీనివాస్ ఈ ఫీట్ రికార్డు చేసి గిన్నిస్ బుక్ అధికారులకు పంపించాడు. స్వతహాగా కరాటే క్రీడాకారుడైన శ్రీనివాస్ ఇప్పుడు ఈ అరుదైన లక్ష్యాన్ని సాధించడం విశేషం. కరాటేతో పాటు జిమ్నాస్టిక్స్, యోగాలో సైతం ప్రావీణ్యం పొందాడు. ఈ ఫీట్ చేసేందుకు అంతర్జాతీయ వెటరన్ క్రీడాకారుడు నీలం లక్ష్మణ్ దగ్గర మెళకువలను నేర్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం బాధ్యులు మహిపాల్, జనార్ధన్‌రెడ్డి, గిన్నీస్ బుక్ ప్రతినిధి విజయభాస్కర్‌లతోపాటు పలువురు క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.
chitram...
కాలి మునివేళ్లపై పరుగు తీస్తున్న
శ్రీనివాస్