రాష్ట్రీయం

గాంధీ భవన్‌కు తాళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగలు అంతిమంగా శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కేంద్రమైన గాంధీ భవన్‌కు తాళం వేయడం వరకూ దారితీశాయి. టికెట్లు దక్కని నేతలు ఆత్మహత్యలు, ఆందోళనలు, ధర్నాలకు గాంధీ భవన్‌నే వేదికగా చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తెకు టిక్కెట్ రాలేదన్న మనస్తాపంతో ఓ సీనియర్ నేత పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతంనగర్ డివిజన్‌కు చెందిన జ్యోత్స్న యాదవ్ తన అనుచరులతో గాంధీ భవన్‌కు చేరుకోనున్నారని తెలుసుకున్న నాయకులు వెంటనే మెయిన్ గేట్‌కు తాళం వేశారు. అక్కడికి చేరుకున్న జ్యోత్స్న తన అనుచరులతో ప్రధాన గేటు వద్దే ఆందోళన కొనసాగించారు.
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ దిష్టి బొమ్మను కార్యకర్తలు దగ్ధం చేశారు. సర్వే సత్యనారాయణ టిక్కెట్ ఇప్పిస్తానని తనను మోసం చేశారని, నవీన్‌కు టిక్కెట్ అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. కాగా, 30 లక్షలకు టిక్కెట్ అమ్ముకున్నారని కార్యకర్తలు ఆరోపించారు. ఘాన్సీబజార్‌కు చెందిన రేణు తన అనుచరులతో ఆందోళన చేశారు. తెలంగాణ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ టిక్కెట్ ఇప్పిస్తానని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఆమె వెంట వచ్చిన కార్యకర్తలు షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లంగర్‌హౌస్ తదితర డివిజన్లలో టిక్కెట్ రాని పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్‌కు చేరుకుని నినాదాలు చేశారు.
గాంధీ భవన్ ఆవరణలో ఆశావాహులు దాడి చేసినా, లేదా ఆత్మహత్యకు పాల్పడినా అనవసరమైన వివాదానికి దారి తీస్తుందని భయపడిన పార్టీ నాయకత్వం ముందు జాగ్రత్త చర్యగా ప్రధాన గేటుకు తాళం వేయించింది. ఇలా ఆందోళనలు వెల్లువెత్తుతున్నందున టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంకా అజ్ఞాతాన్ని వీడలేదు.
కృష్ణ యాదవ్ రాజీనామా
బిజెపి, తెలుగు దేశం పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. టిడిపి ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తనను సంప్రదించనందుకు రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. టిక్కెట్లు రాని నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండు పార్టీల నాయకులు తమ తిరుగుబాటు అభ్యర్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తనను సంప్రదించనందుకు నిరసనగా బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్‌రాథోడ్ రాజీనామా గురువారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే పార్టీ నాయకత్వం జోక్యం చేసుకుని ఆయనకు నచ్చజెప్పడంతో శుక్రవారం రాజీనామా ఉపసంహరించుకున్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధ్యక్షుడు మీసాల చంద్రయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయగా, పార్టీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తిరస్కరించారు.