ఖమ్మం

అటవీ ప్రాంతాల్లో పోలీసుల విస్తృత గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భయం గుప్పిట్లో ప్రజలు
వెంకటాపురం, నవంబర్ 20: అధికార పార్టీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగి ఉలిక్కిపడింది. అధికార పార్టీ కావడంతో పోలీసులు సవాల్‌గా తీసుకుని సరిహద్దు అటవీ ప్రాంతాల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ గ్రామాల ప్రజలు అడవుల్లోకి వెళ్లేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించి ప్రత్యేక కూంబింగ్‌లు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో స్తబ్ధతగా ఉన్న మావో కార్యకలాపాలు కిడ్నాప్‌తో ఒక్కసారిగా తెరపైకి రావడంతో భయాందోళలు చెందుతున్నారు. వెంకటాపురం సర్కిల్ పరిధిలోని వాజేడు, పేరూరు, వెంకటాపురం తదితర పోలీసుస్టేషన్లలో అప్రమత్తంగా ఉండాలని, మావోలు సంచలనం కోసం దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కరపత్రాలు వదిలిన మావోలు
వెంకటాపురం- చర్ల రహదారిలో విజయపురి కాలనీ సమీపంలో శుక్రవారం కరపత్రాలు దర్శనమిచ్చాయి. పీఎల్‌జీఎ 15వ వార్షికోత్సవాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని, డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాయుద్ధంలో ప్రతి కుటుంబం నుంచి గెరిల్లా పోరాటాల్లో పాలుపంచుకోవాలని, మావో రిక్రూట్‌మెంట్‌లో యువత చేరాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌హంట్ నిలిపివేయాలని, ప్రజలు గెరిల్లాగా ఏర్పడి తిరుగుబాటు చేయాలని కరపత్రంలో పేర్కొనట్లు సమాచారం. సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో దర్శనమిచ్చిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.