విజయనగరం

గాడిలో పడేనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం , డిసెంబర్ 18: విజయనగరం నగర పాలక సంస్థలో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. పాలకులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. నిన్నటి వరకు మున్సిపాలిటీగా ఉండగా, ఇప్పుడు నగర పాలక సంస్థగా హోదా పెరిగింది. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో పరిపాలన దారి తప్పింది. ఉద్యోగులపై పర్యవేక్షణ కొరవడింది. వారి పనితీరు ఇష్టారాజ్యంగా మారింది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తుల పెత్తనం పెరిగింది. దీనిని నియంత్రించడంలో అప్పటి ఇన్‌ఛార్జి మున్సిపల్ కమిషనర్ ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీకి నగర పాలక సంస్థగా హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమేకాకుండా, గుజ్జుల నాగరాజును కమిషనర్‌గా నియమించింది. కొత్త కమిషనర్ హయాంలోనైనా ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందేమోననే ఆశలో పట్టణ ప్రజలు ఉన్నారు. ప్రధానంగా పాలకవర్గసభ్యులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. దీనికితోడు అధికారులు, ఉద్యోగులు కొరత ఎక్కువగా ఉంది. కొంతమంది అధికారులు, ఉద్యోగులు మొక్కుబడిగా బాధ్యతలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ కారణంగా పౌర సేవలు అందడంలో విపరీతమైన జాప్యం జరగడమేకాకుండా ప్రభుత్వ పథకాల అమలులో నిర్లిప్తిత ఆవరిచింది. ఫలితంగా ప్రభుత్వ ఆశయం ఆచరణలో నీరుగారే పరిస్థితి నెలకుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన స్మార్ట్‌వార్డుల పథకం అటకెక్కింది. చెట్టు-నీరు పథకం కనిపించకుండాపోయింది. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉంది. కొంతమంది పర్మినెంట్, కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు విధులకు డుమ్మా కొడుతున్నా, పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించవలసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చోద్యం చూస్తున్నారు. వీధిదీపాల వెలగకపోవడం వల్ల రాత్రి సమయాలలో ప్రజలు నరకయాతనలు పడుతున్నారు. దీనిపై పట్టణ ప్రజలు గగ్గోల పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జనన, మరణాల నమోదు కార్యాలయంలో అనధికార వ్యక్తులను నియమించారు. వీరికి ఏ ప్రాతిపదికన బాధ్యతలు అప్పగించారో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్తగా నియమితులైన నగర పాలక సంస్థ కమిషనర్ నాగరాజు ప్రత్యేకంగా దృష్టి సారించి కట్టుతప్పిన పాలనను గాడిలో పెడతారనే ఆశలో ఉన్న పట్టణ ప్రజలు ఉన్నారు.