జాతీయ వార్తలు

మారిటైం బోర్డుకు త్వరలోనే అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ,మార్చి 14: ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఏర్పాటుకు త్వరలోనే అనుమతి మంజూరు చేస్తామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదట ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి పంపించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో తోడ్పడకపోతే దుగరాజుపట్నం ఓడరేవు నిర్మాణం చేపట్టలేమని గడ్కరీ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ అడిగిన ప్రధాన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇస్తూ ఈ విషయం తెలిపారు. మొదట ఆయన మారిటైం బోర్డు ఏర్పాటు గురించి వివరిస్తూ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం జనవరిలో శాసన మండలిలో ఆమోదించి తమకు పంపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియ అత్యంత సుదీర్ఘంగా ఉన్నందున తమ శాఖ ఒక ఆదర్శ చట్టాన్ని తయారు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించిందని ఆయన చెప్పారు. ఏపి ప్రభుత్వం ఈ మోడల్ చట్టం ప్రకారం ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఏపి మారిటైం బోర్డు ఏర్పాటుపై తమ శాఖలో ఈరోజు చర్చ జరిగిందంటూ, దీని ఏర్పాటుకు మరింత ఆలస్యం జరగకుండా చూసేందుకు తమ వైపు నుండి త్వరలోనే అనుమతి మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దుగరాజుపట్నం ఓడరేవు గురించి ఖాన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ ఓడ రేవు కోసం 5,500 ఎకరాల భూమిని సేకరించవలసి ఉన్నదని,, భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరామని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి ఇస్తే ఓడరేవు నిర్మాణాకి సంబంధించిన మిగతా పనిని తమ శాఖ పూర్తి చేస్తుందని గడ్కరీ తెలిపారు.