జాతీయ వార్తలు

కావేరీ సమస్యకు త్వరలో పరిష్కారం : గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వ్యర్థంగా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించేందుకు రెండు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. కావేరీ నదీ జలాలపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ఆయన ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గోదావరి నదికి సంబంధించిన 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని, నదుల అనుసంధానం కోసం రెండు ప్రాజెక్టులు నిర్మించాలని భావిస్తున్నామని, ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యర్థంగా సముద్రంలో కలుస్తున్న నీటితో కావేరీ సమస్యకు త్వరలో పరిష్కారం కనుగొంటామని గడ్కరీ చెప్పారు.