జాతీయ వార్తలు

నేడు తీరం దాటనున్న ‘గజ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గజ’ తుపాను నేడు తీరందాటనున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఆరు గంటల్లో ఇది మరింత బలపడి పంబన్-కడలూరు మధ్య తీరందాటే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించటంతో ఏపీ, తమిళనాడులలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తమిళనాడులోని ఏడు జిల్లాల్లో ఉధృతంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో తమిళనాడులోని తూర్పు నావికాదళం అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించి ఆహారం, తాగునీటి వసతి ఏర్పాట్లు చేశారు.