తెలంగాణ

నయీం అనుచరుల కోసం పోలీసుల గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గ్రేహౌండ్స్‌ కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరుల కోసం హైదరాబాద్‌ శివారులో పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వస్థలిపురంలో అదుపులోకి తీసుకున్న శ్రీధర్‌గౌడ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో నయీం అనుచరుడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రియాజ్‌ను నల్గొండ తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు, నయీం డైరీలో వివరాల ఆధారంగా పలువురు ప్రముఖలపై పోలీసులు నిఘాపెట్టినట్లు సమాచారం. నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సాను 3 రోజుల పోలీసు కస్టడీకి రాజేంద్రనగర్‌ కోర్టు అనుమతించింది. దీంతో వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోర్టు అనుమతితో పుప్పాలగూడలోని నయీం నివాసం రెండో అంతస్తులోని గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.