వరంగల్

ఇక్కడ అంతా.. ‘మామూలే..!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పై అంతస్తుల నిర్మాణాలు
నగర పంచాయతీ ఆదాయానికి భారీగా గండి

నర్సంపేట, నవంబర్ 20: పట్టణంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందల సంఖ్యలో పై అంతస్తుల ఇళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బహుళ అంతస్తులకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తుండడంతో నగర పంచాయతీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అక్రమార్కులపై కొరఢా ఝళిపించాల్సిన సంబంధిత పంచాయతీ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు అందరికి తెల్సిందే. పట్టణంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై అంతా ‘మామూలే’ అంటూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ నుండి నర్సంపేట నగర పంచాయతీగా ఉన్నతీకరణ చెందినా.. ఆచరణలో మార్క్ పాలన ఎక్కడా కనిపించడం లేదు. నగర పంచాయతీలో వంద పైచీలుకు సిబ్బంది, పది మంది పైచీలుకు అధికారులు పనిచేస్తున్నా నిబంధనలను ఏ ఇంటి నిర్మాణానికి వర్తింపజేయడం లేదు. పట్టణంలోని నిషేధిత సర్వే నంబర్లలో సైతం రెండు మూడు, నాలుగు అంతస్థుల భవనాలు జోరుగా నిర్మాణం అవుతున్నాయి. వాస్తవానికి నగర పంచాయతీకి గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్థుల భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మూడు అంతస్థుల భవన నిర్మాణానికి అయితే కు.డా టౌన్ ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నగర పంచాయతీకి శాశ్వత టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయ. ఇన్‌చార్జిలు సైతం అప్ అండ్ డౌన్ చేస్తూ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయకుండా ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణదారులనే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలు. పట్టణంలోని 111 సర్వే నంబర్‌లో ఎలాంటి అనుమతి తీసుకోకుండా కొత్తగా అనేక మంది ఆధునాతన భవనాలను నిర్మించారు. అయితే ఈ భవనాల స్థానంలో పాత ఇళ్లు ఉన్నాయని పేర్కొంటూ నామమాత్రపు ఇంటి పన్నులను వసూలు చేయడం గమనార్హం. దీంతో నగర పంచాయతీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ప్రస్తుతం పంచాయతీ ఆదాయం లోటుగానే ఉంది. అక్రమ నిర్మాణాలను ఆదిలోనే ఆపివేస్తే మరొకరు అనుమతి లేకుండా నిర్మించుకునే అవకాశాలు ఉండవు. కొందరు అక్రమ నిర్మాణదారులు కింది స్థాయి సిబ్బందితో ముందుగానే మాట్లాడుకుని నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకుంటున్నారు. తీరా స్లాబులు పడ్డాక కూలగొడతారా అంటూ వాదనకు దిగుతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని కౌన్సిల్ సమావేశంలో మెజార్టీ కౌన్సిలర్లు పదే పదే చెబుతున్నా ఆచరణలో చిత్తశుద్ధి చూపించే వారు లేరు. ఇదిలా ఉండగా మున్సిపల్ నిబంధనలకు ప్రకారం ఎవరైనా అనుమతులు తీసుకోకుండా ఇళ్లు, ఇతర వాణిజ్య భవనాలు నిర్మించుకుంటే ఫీజు మొత్తానికి కలుపకుని ఫైన్ రూపం వంద రెట్లు వారిని నుండి వసూలు చేయాల్సి ఉంది. అక్రమ నిర్మాణాల దారుల నుండి ఫైన్ వసూలు చేస్తే నగర పంచాయతీకి యాబై లక్షల పైచీలుకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
100 రెట్లు ఫైన్: కమిషనర్ మల్లిఖార్జున స్వామి
అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్న వారి నుండి వంద రెట్లు జరిమానా వసూలు చేస్తామని నగర పంచాయతీ కమిషనర్ మల్లికార్జున స్వామి తెలిపారు. ఇళ్లు నిర్మించుకునే వారు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. ఇప్పటికే నిర్మించుకుని ఉంటే అనుమతుల కోసం కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు పై అంతస్తుల నిర్మాణాల వరకే తమకు అనుమతి ఇచ్చే పరిధి ఉందని చెప్పారు. మూడో ఫ్లోర్ నుండి ఆపై అంతస్తులకు కుడా అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఇళ్లు నిర్మించుకుంటే చర్యలు తప్పవని, అవసరమైతే నిర్మాణాలను కూల్చివేసేందుకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు.