హైదరాబాద్

గండిపేట చెరువును పరిశీలించిన కేంద్ర బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షాభావ పరిస్థితులతో నీళ్లకు కటకట
జలమండలి అధికారుల వివరణ

హైదరాబాద్, డిసెంబర్ 8: గండిపేట చెరువును కేంద్ర కరువు బృందం పరిశీలించింది. రాష్ట్రంలో నెలకొన్ని కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర కరవు బృందం సభ్యులు సింగ్, పొన్ను స్వామి, ప్రియదర్శిని పర్యటిస్తున్నారు. మంగళవారం రాజేంద్రనగర్ మండలం గండిపేట చెరువును బృందం పరిశీలించింది. నగరానికి మంచినీళ్లు అందించే గండిపేట చెరువును చూసి నీటి మట్టం పూర్తిగా ఎండిపోయిందని జలమండలి సిజిఎం బి.విజయకుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గండిపేట చెరువు నీటి మట్టం 1790 ప్రస్తుతం 1757 టిఎంసిలు ఉందని పేర్కొన్నారు. పక్కనే ఉన్న హిమాయూత్‌సాగర్ చెరువులో 1763 పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 1736 నీటి మట్టం ఉందని వివరించారు. కేవలం 0.236టిఎంసిలు ఉందని తెలిపారు. నగరానికి నీటి సరఫరాను కొన్ని రోజులగానే నిలిపివేశామని చెప్పారు. గోదావరి, కృష్ణా మూడోదశ పైపులైన్ ద్వారా నగరానికి నీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి మట్టం పడిపోవడానికి గల కారణాలను కేంద్ర బృందం తెలుసుకుంది. వర్షాభావ పరిస్థితులే కారణమని జలమండలి అధికారులు తెలిపారు. గండిపేట చెరువు మ్యాప్‌తోపాటు అందులోకి వచ్చే మూసినది ఎక్కడ ప్రారంభమైందని, చెరువులోకి వరద నీరు ఏవిధంగా వస్తుందో తెలుసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, జలమండలి అధికారులు కె.సాయినాథ్, రామకృష్ణ, హరిశంకర్, మేనేజర్ వెంకట్‌రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ వెంకటరమణ, ఆర్‌డివో సురేష్ పొద్దార్, రాజేంద్రనగర్ తహాశీల్దార్ వనమాల చంద్రశేఖర్ పాల్గొన్నారు.