జాతీయ వార్తలు

గంగా హారతిలో పాల్గొన్న అబే, మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, డిసెంబర్ 12: మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ ప్రధాని షింజే అబే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పవిత్ర గంగానదికి పూజలు జరిపి అక్కడ జరిగే గంగా హారతిలో పాలు పంచుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర చర్చలు జరిపిన అనంతరం ఇరువురు నేతలు సాయంత్రం వారణాసికి చేరుకుని దశాశ్వమేధ ఘాట్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించడమే కాకుండా అలాగే సంప్రదాయంగా నిర్వస్తూ వస్తున్న గంగా హారతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అబే గౌరవార్థం ఏర్పాటు చేసిన ఒక విందుకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, గవర్నర్ రామ్ నాయక్, రాష్టమ్రంత్రులు ఈ విందుకు హాజరయ్యారు. నెహ్రూ జాకెట్ ధరించిన అబే గంగా హారతి కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ‘హరహర మహదేవ’ నినాదాల మధ్య ఇరువురు నేతలు నదీమతల్లికి పూజలు జరిపారు. కాగా, జపాన్ సహకారంతో వారణాసిలో ఒక కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో తెలియజేసారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం జపాన్ ప్రదాని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు.