రాష్ట్రీయం

అధికారుల నుంచి నా భర్తకు ప్రాణహాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లం గంగిరెడ్డి బార్య మాళవిక ఆరోపణ

హైదరాబాద్, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి భార్య మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన భర్తను హతమార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తన భర్త గంగిరెడ్డికి తగిన రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డికి విధేయుడిగా ఉన్నందువల్లే ప్రతీకార చర్యగా చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులను బనాయించిందని ఆరోపించారు. అలిపిరి ఘటనలో తన భర్తను జిల్లా కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముఖ్యమంత్రి మన్ననలు పొందేందుకు తన భర్త దేశంలో లేని సమయంలో అనేక కేసుల్లో అతనిని ముద్దాయిగా చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార నిమిత్తం మారిషస్‌కు వెళ్లిన గంగిరెడ్డిని అక్రమంగా అక్కడ బంధించి దేశానికి తరలించారని అన్నారు. పలు కేసుల్లో విచారణ పేరుతో కస్టడీకి తీసుకొని, హింసించి ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. మారిషస్ నుంచి తీసుకువస్తున్న సమయంలోనే తనకు ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు ఆయన చేత బలవంతంగా చెప్పించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని తన భర్తను రక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీలో తన భర్తకు రక్షణ లేనందున ఆయన కేసులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసి, విచారణ జరిపించాలని వేడుకున్నారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పిన ఆమె ప్రభుత్వమే హతమార్చితే ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఉంటుందని, అందుకే మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. (చిత్రం) విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న గంగిరెడ్డి భార్య మాళవిక