కృష్ణ

గన్నవరం విమానాశ్రయంలో జపాన్ గవర్నర్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: జపాన్ గవర్నరు తకకాజుఇషి ఆధ్వర్యంలో 15 మంది సభ్యుల బృందానికి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర పర్యాటక, పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతోను సత్కరించి ఘన స్వాగతం పలికారు. జపాన్ గవర్నరు టకకాజుఇషి మరియు చైర్మన్ టకాయవోయామా, ఫెడరేషన్ ఆఫ్ పొయామా చైర్మన్ షిజియోటకాజి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటు టకాసిఇనో, ప్రెసిడెంటు పొయామా ఫార్మసిటికల్స్, కుషియోనకాయి, వైస్ ప్రెసిడెంట్ ఎసినోబుట్సోగా, పర్యాటకశాఖ డైరక్టర్ జనరల్ అరిహియో, యురిషిబాట, డైరక్టర్ కమ్ సెక్రటరీ హిరోషిసానులో, ఫార్మాస్యూటికల్స్ డైరక్టర్ నోషిహుమిబంజాయా, ఇతర ఆరుగురు సభ్యుల బృందం ఢిల్లీ నుండి ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో జపాన్‌కు చెందిన చెన్నై ప్రాంతీయ చైర్మన్ సైజిబాబ, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, నూజివీడు సబ్ కలెక్టర్ డా.జి.లక్ష్మీషా, తహశీల్దార్ ఎం.మాధురి, తదితరులు గన్నవరం విమానాశ్రయంలో బృందం సభ్యులకు భారతీయ సాంప్రదాయ ప్రకారం నుదుట తిలకం దిద్ది, శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. బృందం వెంట ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార సమన్వయ కర్త కంభంపాటి రామ్మోహనరావు బృందం సభ్యులతో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం జపాన్ బృందం రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ నగరానికి బయలుదేరి వెళ్లారు.
జపాన్ బృందం సోమవారం నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుచేసిన అమరావతి తదితర ప్రదేశాలు పర్యటించి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ, పర్యాటకశాఖ ఉన్నతాధికారులతోను, రాష్ట్ర ముఖ్యమంత్రితోను, సమావేశమై పర్యాటక అభివృద్ధికి పరిశ్రమల ఏర్పాటుకు చర్చను నిర్వహిస్తారు. అనంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతి తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక పెట్టుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జపాన్ గవర్నరు టకకాజుఇషి సమక్షంలో ఒప్పందం అంగీకార పత్రాలపై సంతకాలు చేయనున్నారు.