విశాఖపట్నం

ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కార్యకర్తలు వారధిలా పనిచేయాలి
* జనచైతన్య యాత్రలో మంత్రి గంటా
విశాఖపట్నం, డిసెంబర్ 11: ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలపై ఉందని రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. విభజన తర్వాత రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అపార అనుభవంతో సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఏకకాలంలో నిర్వహించగలుగుతున్నారన్నారు. ముఖ్యంగా రైతు, డ్వాక్రా రుణమాఫీతో పాటు సామాజిక పింఛన్లను రూ.200 నుంచి 1000కి పెంచడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని నిరూపించారన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్దిదార్లకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక పార్టీ పరంగా తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యకర్తల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ పరంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు కార్యకర్తల సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, వారి సంక్షేమం కోసం పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా మోటార్ సైకిల్ ర్యాలీని సరస్వతి పార్కు వద్ద మంత్రి గంటా శ్రీనివాసరావుప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీ పాతబస్టాండ్, పోస్ట్ఫాసు, కలెక్టరేట్, జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్, న్యూకాలనీ మీదుగా దక్షిణ నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాల వరకూ సాగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.