బిజినెస్

పెట్టుబడుల లక్ష్యం లక్ష కోట్ల రూపాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ భాగస్వామ్య సదస్సుపై మంత్రి గంటా

విశాఖపట్నం, డిసెంబర్ 31: లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు లక్ష్యంగా విశాఖ నగరంలో సిఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో సదస్సు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ తరహాలో ఈ సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను రెండో గమ్యంగా ప్రపంచబ్యాంక్ ప్రకటించిందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా నిర్వహించే ఈ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో విదేశీ ప్రతినిధులు దాదాపు 300 మంది వరకు ఉండవచ్చని తెలిపారు. సదస్సును విజయవంతం చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కాగా, వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కుదిరిన 70 శాతం ఎంఒయులు అమల్లోకి వచ్చాయని, ప్రస్తుత భాగస్వామ్య సదస్సులో కుదరనున్న అన్ని ఎంఒయులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి, రవాణా తదితర సౌకర్యాలు కల్పించేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్టు వివరించారు. ప్రతి విదేశీ ప్రతినిధికి ఎస్కార్టును, లైజనింగ్ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సదస్సు విజయవంతానికి సిఐఐ ప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. (చిత్రం) సదస్సు ఏర్పాట్లపై సమీక్ష జరుపుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు