జాతీయ వార్తలు

శాశ్వత పరిష్కారం చూస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాపు రిజర్వేషన్లపై మంత్రి గంటా
న్యూఢిల్లీ, మార్చి 10: కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించేందుకు టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుస్పష్టం చేశారు. ఆయన గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఎవరి ప్రయోజనాల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు చేస్తూన్నారని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో గతంలో మాదిరి కాకుండా శాశ్వత పరిష్కరం చూపడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని గంటా అన్నారు. ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాసిన లేఖ అభ్యంతరకరంగా ఉందని ఆయన విమర్శించారు. కాపులకు ముద్రగడ ఒక్కరే నాయకుడు కారని, తాముకూడా కాపులకు ప్రాతినిధ్యం వహిస్తూన్నామని మంత్రి చెప్పారు. వైకాపా అధ్యక్షుడు జగన్ మీట నొక్కితే ముద్రగడ మాట్లాడుతూన్నాట్టు ఉందని ఆయన ఆరోపించారు. కాగా కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సిఎం చంద్రబాబుదేనని మంత్రి తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్రంలో గిరిజన, కేంద్రీయ విశ్వ విద్యాలయాలను ఏర్పాటుకు ఈ ఏడాది నుంచే అవసరమైన ప్రకియ పూర్తిచేయలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కోరినట్లు మంత్రి వెల్లడించారు. కేంబ్రిడ్జి వర్శిటీ ప్రతినిధి బృందం ఈ నెల 25న రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతుందని శ్రీనివాసరావుచెప్పారు. కాగా కాపుసోదరులు వైకాపా ప్రలోభాలకు లోనుకావద్దని టిడిపి ఎంపీలు తోట నరసింహం, అవంతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.