మెయిన్ ఫీచర్

గ్యాప్ మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా వెతికితే -సమస్య కడుపులోనే పరిష్కారం ఉంటుంది. కనిపెట్టినోడు ముందుకెళ్తాడు. భయపడినోడు కనుమరుగైపోతాడు.

సమస్య నుంచి పరిష్కారానికి జరిపే ప్రయాణమే -సినిమా. సో, సమస్యను పుట్టించి,
పరిష్కరించే ప్రక్రియ పరిశ్రమకు బాగా తెలుసుకనుక -ఎదురైన సమస్యను
పరిష్కరించుకోవడం దానికి పెద్ద కష్టం కాదు. అలాంటి పరిష్కారాల్లో తాజా పరిష్కారమే -గ్యాప్.

ఇటీవలి కాలంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య -్భరీ నిర్మాణంతో వస్తున్న సినిమాల విడుదలకు ఒకే ముహూర్తం కుదరడం. నిజానికి తెలుగు పరిశ్రమలో సినిమా రాశి పెరుగుతోంది. వాసి పదునుదేరుతోంది. చిన్న సినిమానైనా పెద్ద బడ్జెట్‌తోకొట్టే రోజులే వచ్చేశాయి. ఇక పెద్ద సినిమాలైతే, కోట్లాటకు వెనుకాడటం లేదు. భారీ నిర్మాణం జరుపుకున్న పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుడి ముందుకొస్తే -ఏ సినిమాను చూడాలన్న సందిగ్దం ప్రేక్షకుడికి కలగొచ్చు. ఒక సినిమాను ఆదిరిస్తే -రెండో సినిమా బిచాణా సర్దేయాలి. ఎందుకంటే -సినిమాలు పెరుగుతున్నంతగా ప్రేక్షకులు పెరగరు. వారానికో సినిమా అంటే ఓకేగానీ, వస్తున్న సినిమాలన్నీ చూడటమే ప్రేక్షకుల పనికాదు. అంటే -తొలివారంలో వచ్చే కలెక్షనే్ల పెద్ద సినిమాకు ప్రాణం. ఈ పరిస్థితుల్లో కొన్ని -్ఫరవాలేదనుకున్న సినిమాలు సైతం ఫలితంకరవై వెనక్కిపోయే ప్రమాదం దాపురిస్తోంది. లేదంటే మరోసారి థియేటర్లకు తెచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఇదీ -ఇటీవలి కాలంలో పరిశ్రమను పట్టిపీడిస్తోన్న సమస్య.

ఆ సమస్యకు సరికొత్త రాజీమార్గమే -గ్యాప్
ఈ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు కొన్ని ప్రకటించిన తేదీకి విడుదల కావడం లేదు. -గ్యాప్ కోరుకుంటున్నాయి. ఇతర సినిమాలూ అదే తేదీ విడుదలకు సిద్ధమైతే -తప్పని పరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాలు వెనక్కెళ్తున్నాయి. కష్టాన్ని తప్పించుకోవడానికి పోస్ట్‌పోన్‌మెంట్ ఎంచుకున్నా -దీనివల్లా ప్రమాదం ఉంది. ఆ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గొచ్చు. నిర్మాతకు పెట్టుబడిపై వడ్డ్భీరం పెరగొచ్చు. వెనకబడితే -ఆడియన్స్ ఆదరణ లభించే సమయం దొరక్కపోవచ్చు. పోస్ట్‌పోన్‌మెంట్‌లోనూ ఇన్ని చిక్కులున్నాయి. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలి? సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు ఈ ప్రశ్నకు వెతుక్కున్న సమాధానమే -గ్యాప్. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుని విడుదల తేదీలు ప్రకటించుకుంటే -కొంత ఫలితం ఉంటుందంటున్నారు నిర్మాతలు. ఉదాహరణకు -వచ్చే మూడువారాల్లో మూడు పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఆయా నిర్మాతలు చేసుకున్న అగ్రిమెంటే ఇది. లేదంటే -ఎవరి ముహూర్తంలో వాళ్లు సినిమాను థియేటర్లకు వదిలేసివుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. అనుష్క ఫేంగా వస్తున్న సైజ్ జీరో, అఖిల్ ఫేంగా వస్తున్న శంకరాభరణం, రవితేజ ఇమేజ్‌తో వస్తున్న బెంగాల్ టైగర్ సినిమాల విడుదల విషయంలో ముగ్గురు నిర్మాతలూ ఒక ఒప్పందానికి వచ్చినట్టు వినికిడి. ఒకే టైంలో సినిమాలు విడుదలైతే -అసలుకే మోసం వస్తుందన్న భయాలు నిర్మాతలను వెంటాడాయి కనుక, నవంబర్ 27న సైజ్‌జీరో విడుదలవుతుంటే -డిసెంబర్ 4న శంకరాభరణం థియేటర్లకు వస్తుంది. ఇక తరువాతి వారం డిసెంబర్ 10న బెంగాల్ టైగర్ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతల మధ్య ఒప్పందం కుదిరినట్టు పరిశ్రమవర్గాల కథనం.
నిజానికి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి థియేటర్లకు రావడం వల్ల పరిశ్రమకూ ప్రమాదమే అంటున్నారు నిర్మాతలు. పైగా పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఒక్కరే ఉంటుండటంతో సినిమాలను తప్పని పరిస్థితుల్లో వాయిదా వేయక తప్పడం లేదు.

కొద్దిరోజుల క్రితం-
రుద్రమదేవి ప్రత్యేక ప్రెస్‌మీట్‌లో గుణశేఖర్ టీమ్‌వర్క్‌ని అభినందిస్తూనే, పరిశ్రమ పరిస్థితులపై కామెంట్ చేశాడు దర్శకరత్న దాసరి. ఇప్పటికే చిన్న చిత్రాలపై పలుమార్లు గొంతువిప్పిన దాసరి -ఈసారి పెద్ద సినిమా కోసమూ గళం విప్పారు. రుద్రమదేవి వంటి చారిత్రక చిత్రాన్ని సరిగ్గా ఆడనీయరా? అన్నది సీరియర్ దర్శకుడు దాసరి గళం నుంచి వినిపించిన ప్రశ్న. ఇలాంటి సినిమాను బతకనీయకుండా కేవలం వారం గ్యాప్‌లోనే భారీ క్రేజీ హీరోల సినిమాలను వదిలేయడం ఇండస్ట్రీకి మంచిది కాదన్నది ఆయన చేసిన సూచన. పైగా హీరో సినిమాలకు పండుగ ఉండదని, వారి సినిమా ఎప్పుడు విడుదలైతే అదే పండగని కూడా దాసరి వ్యాఖ్యానించారు. అవును -ఇందులో నిజం లేకపోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరో సినిమాలకూ పండుగలే ఆధారమవుతున్నాయి. కలెక్షన్లు రాబట్టుకోవడానికి పబ్బాలే ముఖ్యమవుతున్నాయి. ఎందుకంటే పైరసీ అడ్డూఅదుపూ లేకుండా విశృంఖలంగా విజృంభిస్తుండటంతో హీరో సినిమాలకు సైతం తొలివారం కలెక్షనే్ల శ్రీరామరక్ష అన్నది తేలిపోయింది.
అయితే దాసరి వ్యాఖ్యలను పరిశీలిస్తే -ఇండస్ట్రీలో ఎంత పోటీవున్నా, ఆరోగ్యకరమైన కలెక్షన్లకు గ్యాప్‌లు అత్యవసరమన్నది అందరికీ అర్థమవుతున్నదే. బాహుబలి వంటి సినిమా డేట్ ప్రకటించగానే ఆఖరికి చిన్న సినిమాలు సైతం థియేటర్లను ఖాళీచేసి మరీ సహకరించాయి. అదే రుద్రమదేవి విషయానికొస్తే ఇలాంటి సహకారం జరగలేదు, సరికదా వారం గ్యాప్‌లోనే బ్రూస్‌లీ థియేటర్లకు వచ్చేసింది. అదేంటి? అంటే విడుదల తేదీని షూటింగ్ ప్రారంభించిననాడే ప్రకటించాం! దాని ప్రకారమే రిలీజ్ చేసేశాం అన్నది సమాధానం. రుద్రమదేవి చిత్రమే పలుమార్లు వాయిదాలు పడి మేం ప్రకటించుకున్న విడుదల తేదీ ముందుకొచ్చిందన్న వాదనా వినిపించింది. ఈ విషయంలో కొంత నిజం కూడా ఉండొచ్చు. ఇది నిర్మాత తెలిసే చేశాడు కూడా! ఎందుకంటే పలుమార్లు వాయిదాపడటం.. బడ్జెట్ చేతులు దాటిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ డేట్‌లో కూడా రిలీజ్ కాకపోతే భారీ నష్టం తప్పదన్న భయాలు వెంటాడాయి. పైగా సినిమా త్రీడి వెర్షన్‌లో రూపొందడం, చారిత్రాత్మక నేపథ్యం కావడం, దసరా సెలవులు రావడం వంటివి నిర్మాతకు కొంత బలాన్నిచ్చాయి.
అయితే, ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయడంలో గుణశేఖర్ సక్సెస్ కాలేకపోయినా ప్రజల్లోవున్న కొద్దిపాటి ఆసక్తి ఓపెనింగ్స్‌ని రాబట్టగలిగింది. బాహుబలితో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న అనుష్క సైతం ఈ సినిమా విషయంలో హెల్ప్ కాలేకపోయిందనే చెప్పాలి. నిడివి తక్కువైనా అల్లు అర్జున్ పాత్ర హైపుతో ఈ సినిమాను ప్రమోట్ చేయాలన్న నిర్మాత ఆశ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
దాసరి వ్యాఖ్యల అనంతరం అనూహ్యంగా నాగార్జున తనయుడు అఖిల్ ఎంట్రీ సినిమా ‘అఖిల్’ గ్రాఫిక్ వర్క్ కారణాల దృష్ట్యా వెనక్కి వెళ్ళిందని ప్రకటించారు నిర్మాత. అప్పటికే అఖిల్ కోసం రిజర్వ్ అయిన థియేటర్లు మరో సినిమా కోసం ఎదురుచూడగా, అక్టోబర్ 2న విడుదల కావాల్సిన ‘కంచె’ సడెన్‌గా 22వ తేదీని భర్తీ చేయడానికి రెడీ అయిపోయింది. దీంతోపాటు కొన్ని చిన్న సినిమాలూ విజయదశమి హడావిడికి సై అన్నాయి. అఖిల్ వాయిదా వెనుక ‘అమరావతి రాజధాని నిర్మాణ హడావిడి’ కూడా ఉందనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి.
ఇండస్ట్రీలో ఏ నిర్మాత అయినా సినిమా పూర్తిచేసిన వెంటనే బిజినెస్ చేసుకోవాలనే తహతహలో వుంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాప్‌కోసం ఆగితే వడ్డీలు పెరిగిపోయే పరిస్థితి. అందుకే పెద్ద సినిమా మీద చిన్న సినిమా సైతం భయపడటం లేదు. థియేటర్లు దొరికితే చాలు విడుదల తేదీని ప్రకటించేసుకుంటున్నాయి. వారం.. రెండువారాల్లో వచ్చిన మొత్తాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. తెలుగులో సినిమాల నిర్మాణం సంఖ్య గణనీయంగా పెరిగినా సక్సెస్‌ల శాతం అంతంత మాత్రంగానే కనిపిస్తుంది.
పెద్ద సినిమా వస్తుందంటే వందలాది థియేటర్లు బ్లాక్ అయిపోవడం కామనైపోయింది. సినిమా బావుంటే యాభై రోజులు... బాగోకపోతే రెండువారాలన్నట్టు తయారవ్వడంతో సడెన్ రిలీజ్ డేట్‌లకు సినిమాలు రెడీగా ఉండాల్సి వస్తుంది. అనుకున్నస్థాయిలో థియేటర్లు దొరకడం వల్లే ‘కంచె’ రాగలిగింది. ఇండస్ట్రీలో హీరోల సంఖ్య (వంశపారంపర్యంగా) పెరగడంవల్ల వారిమధ్య పోటీకంటే త్వరత్వరగా కలెక్షన్లు రాబట్టుకోవాలనే తీరు పెరిగిపోతుంది. పైగా నాలుగంకెల బడా నిర్మాతల చేతుల్లోనే థియేటర్లు ఉండటంవల్ల సినిమాను వారు చెప్పిన డేట్‌కే రిలీజ్ చేయక తప్పని పరిస్థితి. ఎంతైనా ఈ వ్యాపారంలో, ఇండస్ట్రీలో అందరూ బావుండాలంటే కనీసం రెండువారాలైనా సినిమాలకు గ్యాప్ తీసుకోవడం మంచిది. లేకపోతే ఎంత గొప్ప సినిమానైనా ప్రేక్షకుడు చూద్దాం అనుకునే లోపే థియేటర్ వదిలి వెళ్ళక తప్పదు. ఈ పరిస్థితులవలనే ఆ తర్వాత వచ్చిన సినిమా ఫలితం బాగోకపోతే తిరిగి ముందు సినిమానే అదే థియేటర్లో వేయాల్సివస్తుంది. కానీ అప్పటికే ప్రేక్షకుడి దృష్టిలో ఆ సినిమా ఔట్‌డేట్ సినిమాగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు రిలీజైన సినిమాల ఫలితాలను చూసుకుని డేట్స్ ప్రకటించుకుంటే అందరికీ మంచిదన్నది అనుభవజ్ఞులు చెప్తున్న అక్షరసత్యం.

-పోలిశెట్టి