బిజినెస్

ఎల్‌ఎన్‌జి ధర తగ్గించిన ఖతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.12 వేల కోట్ల పెనాల్టీ రద్దు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దీర్ఘ కాలిక ఒప్పందంపై భారత్‌కు అమ్ముతున్న గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) ధరను దాదాపు 600 కోట్ల డాలర్ల వరకు తగ్గించేందుకు ఖతర్ అంగీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరల తగ్గుదలకు అనుగుణంగా ఖతర్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 2015లో తక్కువ గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నందుకు భారత్‌కు విధించిన 12 వేల కోట్ల రూపాయల పెనాల్టీని కూడా ఖతర్ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి తాజాగా సవరించిన ఒప్పందంపై దేశంలో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారు అయిన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి లిమిటెడ్ (పిఎల్‌ఎల్), ఖతర్‌కు చెందిన రస్‌గ్యాస్ గురువారం సంతకాలు చేశాయి. ప్రస్తుతం 12 నుంచి 13 అమెరికా డాలర్లుగా ఉన్న ఎంఎంబిటియు (మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్) గ్యాస్ ధర సవరించిన ఫార్ములా ప్రకారం 6 నుంచి 7 డాలర్లకు తగ్గుతుందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రస్‌గ్యాస్ నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ కుదుర్చుకున్న దీర్ఘ కాలిక ఒప్పందం 2028 ఏప్రిల్‌లో ముగుస్తుందని, ప్రస్తుతం సవరించిన ఫార్ములా ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జి కొనుగోలుకు వర్తిస్తుందని ఆయన వివరించారు. (చిత్రం) న్యూఢిల్లీలో గురువారం ఒప్పంద సవరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్