జాతీయ వార్తలు

గ్యాస్ సబ్సిడీ.. కలవారికి కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే నెల నుంచే వర్తింపు ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: సబ్సిడీల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇకమీదట చౌక ధరకు జరిపే ఇంధన సరఫరాలను కుదించుకోవాలని సోమవారం నిర్ణయించింది. దీంతో సంవత్సరానికి 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారులకు వచ్చే నెల నుంచి రాయితీ ధరకు వంట గ్యాస్ (ఎల్‌పిజి) లభించదు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 608 రూపాయల చొప్పున అమ్ముతున్న 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి 12 చొప్పున అన్ని కుటుంబాలకు రాయితీపై 419.26 రూపాయలకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఎల్‌పిజిపై రాయితీని ఉపయోగించుకోవడం మానుకుని మార్కెట్ ధరకు వంట గ్యాస్‌ను కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం దీనిపై నిర్ణయాన్ని ప్రజల అభీష్టానికే వదిలేసిందని చమురు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ప్రస్తుతం దాదాపు 15 కోట్ల మంది ఎల్‌పిజి వినియోగదారులు ఉండగా, వీరిలో ఇప్పటివరకూ దాదాపు 57.5 లక్షల మంది రాయితీలను వదులుకున్నారు. చాలా మంది వినియోగదారులు స్వచ్ఛందంగా రాయితీలను వదులుకున్నందున అధిక ఆదాయ వర్గాల వినియోగదారులకు బహిరంగ మార్కెట్ ధరకే ఎల్‌పిజి సిలిండర్లను సరఫరా చేయాలని ప్రభుత్వం భావించిందని, 1961 ఆదాయ పన్ను చట్టం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించిన పన్ను చెల్లింపుదారులకు ఇకమీదట ఎల్‌పిజి సిలిండర్లపై రాయితీ ఇవ్వరాదని నిర్ణయించిందని చమురు మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.